యంగ్ టైగర్-కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న దేవర మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. షూటింగ్ షెడ్యూల్స్ అప్ డేట్ అంటూ హడావిడి చేస్తున్నారు మేకర్స్. ప్రతి షెడ్యూల్ మొదలయ్యే ముందు, పూర్తయ్యాక క్రేజీ అప్ డేట్స్ ఇస్తూ ఎన్టీఆర్ ఫాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇలా దేవర అప్ డేట్స్ తో ఎన్టీఆర్ ఫాన్స్ సంతోషపడిపోతుంటే.. అటు అల్లు ఫాన్స్ పుష్ప అప్ డేట్ రాక కొట్టేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో దేవర న్యూస్ చూడగానే అల్లు ఫాన్స్ మొహం మాడిపోతుంది. తాజాగా దేవర నుండి ఈ రోజు క్రేజీ అప్ డేట్ ఇవ్వబోతున్నట్లుగా కొద్దిసేపటి క్రితమే మేకర్స్ ట్వీట్ చేసారు. మరి దేవరకి సంబందించిన ఏ అప్ డేట్ వస్తుందా అని ఎన్టీఆర్ ఫాన్స్ ఆత్రంగా వెయిట్ చేస్తుంటే.. అటు అల్లు ఫాన్స్ మాత్రం కుళ్ళుకుంటున్నారు. కారణం అల్లు అర్జున్-సుకుమార్ లు ఎప్పటినుండో పుష్ప 2 సెట్స్ మీదున్నారు. ఇంతవరకు డేట్ లాక్ చెయ్యలేదు.
అసలు షూటింగ్ ఎక్కడివరకు పూర్తయ్యిందో అనేది మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ ఏప్రిల్ మొదటివారంలో మొదలైన దేవర అప్ డేట్స్ సోషల్ మీడియాని చుట్టేస్తుంటే ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకుంటూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకే అల్లు ఫాన్స్ తెగ ఫీలయ్యేది, కుళ్ళుకునేది.