మెగా వారసురాలు, మెగాస్టార్ చిరంజీవి మనవరాలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుమార్తె క్లింకార దర్శనం కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. జూన్ 20 న అపోలో ఆసుపత్రిలో రామ్ చరణ్-ఉపాసన దంపతులకి జన్మించిన క్లింకారకి ఆ తర్వాత 11 రోజులకి నేమింగ్ సెర్మోని, బారసాల ఫంక్షన్స్ ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రస్తుతం ఉపాసన తన బిడ్డతో పాటు తల్లితండ్రులైన కామినేని శోభన గారింట్లోనే ఉంటుంది. అమ్మమ్మ-తాతయ్యలుగా ప్రమోట్ అయిన వారు మనవరాలు క్లింకార తో స్పెండ్ చేస్తున్నారు.
ఇక మెగాస్టార్ చిరు ఫ్యామిలీ కూడా తరచూ మానవరాలితో ఆడుకుంటున్నాడు. క్లింకార దర్శనం కోసం వెయిట్ చేస్తున్న మెగా అభిమానులని సర్ ప్రైజ్ చేసారు. నిన్న ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా కామినేని ఫ్యామిలీ జెండా వందనం కార్యక్రమంలో మనవారిలితో పాటుగా జెండా ఎగరేసిన పిక్స్ ని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది. శోభన కామినేని మనవారు క్లింకార ని ఎత్తుకొని జెండా వందనం చేయిస్తున్న పిక్స్. పాప ఫేస్ కనిపించకపోయినా.. ఆమె చేతి వేళ్ళని చూసే మెగా అభిమానులు ఆనందపడిపోతున్నారు.
ఉపాసన డెలివరీ వరకు యాక్టీవ్ గా కనిపించింది. అలాగే పాప జన్మించిన తర్వాత కూడా ఉపాసన అంతే ఎనేర్జిటిక్ గా కనబడింది. పాప పుట్టిన రెండు నెలలకే ఉపాసన తన దినచర్యలో బిజీగా మారిపోయింది. అపోలో హాస్పిటల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపాసన రీసెంట్ గానే పాల్గొంది.