సమంత కొద్దిరోజులుగా షూటింగ్స్‌కు దూరంగా ఉంటుంది. బాలి వెకేషన్స్ తర్వాత సమంత మళ్ళీ సైలెంట్ అయ్యింది. ఖుషి ప్రమోషన్స్‌కి రాకపోవడంతో సమంతపై రౌడీ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్స్ మొదలెట్టారు. ప్రమోషన్స్‌కి రావు.. కానీ ఎంజాయ్ చేస్తావ్, జిమ్‌లో వర్కౌట్స్ మానవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దానితో సమంత కూడా తనని ట్రోల్ చేస్తున్న అందరికీ సోషల్ మీడియా వేదికగా గట్టిగా కౌంటర్ వేసింది. అయితే విజయ్ దేవరకొండతో కలిసి సమంత ఖుషి ప్రమోషన్స్ కోసం ఓ కామన్ ఇంటర్వ్యూ, అలాగే మంగళవారం జరిగే మ్యూజికల్ కాన్సెర్ట్‌లో మాత్రమే పాల్గొనబోతుందనే న్యూస్ వైరల్ అయ్యింది.
అన్నట్టుగానే మూవీ టీంతో కలిసి సమంత ఓ కామన్ ఇంటర్వ్యూలో కనిపించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషలకి కలిపి ఒకే ఇంటర్వ్యూ జరిగింది. తాజాగా సమంత ఖుషి మ్యూజికల్ కాన్సెర్ట్ కోసం రెడీ అయిన ఫొటోస్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సమంత ఇన్‌స్టా పేజీలో షేర్ చేసిన ఈ పిక్స్‌లో ఆమె గ్లామర్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాస్త సన్నగా కనిపించినా.. కళ్ళకి కళ్లద్దాలు, చెక్స్ అవుట్ ఫిట్ లో చాలా కొత్తగా ఆమె కనిపించింది. చాలా స్టైలిష్‌గా ఇన్నోసెంట్ ఫేస్‌తో అదరగొట్టింది. ఈ పిక్స్ చూసి సమంత న్యూ అవతార్‌లో కనిపిస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మళ్లీ సమంత టాలీవుడ్‌లో దర్శనమిచ్చిందని మరికొంత మంది అంటున్నారు.