హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దశాబ్దంన్నర దాటుతున్నా నేటికీ అదే జోరు, అదే గ్లామరు మెయిన్ టైన్ చేస్తూ వస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ జర్నీలో ఇటు తెలుగులోనూ, అటు తమిళ్ లోనూ కూడా ఆల్ మోస్ట్ ఆల్ స్టార్స్ హీరోస్ సరసన నటించేసి, నర్తించేసింది తమన్నా. అయితే ఈ క్రెడిట్ తో పాటు మరో ఆన్ వాంటెడ్ ఫీట్ ఆమె అకౌంట్ లోకి చేరింది. అదేంటంటే...
ప్రెజెంట్ స్టార్ హీరోస్ అందరితోనూ జతకట్టిన తమన్నా చాలామంది కథానాయకుల కెరీర్ బిగ్గెస్ట్ ప్లాప్స్ లో భాగమైంది. పవన్ కళ్యాణ్ తో కెమెరా మెన్ గంగతో రాంబాబు, మహేష్ బాబుతో ఆగడు, ప్రభాస్ తో రెబల్, ఎన్ఠీఆర్ తో ఊసరవెల్లి, అల్లు అర్జున్ తో బద్రీనాథ్, రామ్ తో ఎందుకంటే ప్రేమంట, నితిన్ తో మ్యాస్ట్రో, నందమూరి కళ్యాణ్ రామ్ తో నా నువ్వే, గోపీచంద్ తో సీటీమార్, రీసెంట్ గా చిరంజీవితో సైరా, భోళా శంకర్ వంటి భారీ పరాజయాల్లో పాలు పంచుకున్న తమన్నాకి తమిళ్, హిందీలోనూ ఇదే తరహా ఫలితాలున్నాయి.
అయితే మన టాలీవుడ్ లో F 2 తో వెంకటేష్ కి, ఊపిరితో నాగార్జునకి, రచ్చతో రామ్ చరణ్ కీ, బెంగాల్ టైగర్ తో రవితేజకి, 100 పర్శంట్ తో నాగ చైతన్యకి మాత్రం కాస్త బెటర్ రిజల్ట్స్ చవి చూపించిన తమన్నా బాహుబలి లో భాగం కావడం మాత్రం ఆమె అదృష్టమనే చెప్పుకోవాలి. రజనీ జైలర్ రిజల్ట్ మళ్ళీ ఆమెని కొన్నాళ్ళు రక్షిస్తుందనే భావించాలి. ఏదేమైనా అంతమంది హీరోల అంతటి ఘోర పరాజయాల్లో తమన్నానే ఉండడం మాత్రం అమ్మో తమన్నా.. ఇదేం దారుణమన్నా అనేలా చేస్తోంది అందరినీ..!!