తమన్నాని ఆ ఇద్దరూ మోసం చేశారు!
Tamannaah Unhappy with Jailer and Bholaa Shankarపాపం తమన్నా.. నిజంగా ఆమెది బ్యాడ్ లక్. హిందీలో లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సీరీస్ తో బిగ్గెస్ట్ ప్లాప్ అందుకున్న తమన్నా ఎంతగా గ్లామర్ షో చేసినా వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇప్పుడు తమన్నాని సూపర్ స్టార్-మెగాస్టార్ ఇద్దరూ మోసం చేశారు. అందాలు ఆరబోయడంలో హద్దులు దాటేసిన తమన్నా.. రజనీకాంత్ జైలర్, చిరంజీవి భోళా శంకర్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. కానీ చిరు-రజని ఇద్దరూ తమన్నాకి ఝలక్ ఇచ్చారు.
జైలర్ సినిమా హిట్ అయినా అందులో తమన్నా పాత్ర కేవలం పాటలకి అందులోను ఒక్క పాటకే పరిమతమైంది.. అక్కడక్కడా మాత్రమే కనిపించింది. జైలర్ సినిమాలో తమన్నా నువ్వు కావాలయ్యా సాంగ్ తో బీభత్సమైన హడావిడి చేసింది. ఎక్కడ చూసినా అదే స్టెప్స్, అంతేకాదు.. అందాలు చూపించడంలో అస్సలు తగ్గలేదు. ఇక మెగాస్టార్ చిరు భోళా శంకర్ లోనూ అంతే.
తమన్నా గ్లామర్ కేవలం పాటలకే పరిమితమైంది. లాయర్ గాను తమన్నా పెద్దగా ఆకట్టుకోకపోగా.. భోళా శంకర్ రిజల్ట్ ఆమెని మరింత బాధపెట్టింది. ఒకవేళ జైలర్-భోళా శంకర్ ఇక్కడ తెలుగులో హిట్ అయితే తమన్నాకి సీనియర్ హీరోలు ఛాన్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆమెని దర్శక నిర్మాతలు ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటారో అనేది తేలాల్సి ఉంది.
Tamannaah Disappoints with Chiru and Rajini Films






































