ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు చాలా విషయాల్లో లైట్ తీసుకునేవారు. డేరింగ్ స్టెప్స్ పెద్దగా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఆయన చంద్రబాబు 2.0గా మారిపోయారు. ఏపీ సీఎం జగన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబుకు ఉన్న రాజకీయ అనుభవం ఏమైనా తక్కువా? 40 ఇయర్స్. అధికార పార్టీని ఎక్కడ తొక్కాలో పూర్తిగా తెలిసిన వ్యక్తి. గతంలో ఆయన పర్యటనలకు పెద్ద ఎత్తున జనం హాజరైతే వైసీపీ నేతలు లైట్ తీసుకున్నారు. కానీ పోను పోనూ ప్రతి సభకు కూడా జనం విపరీతంగా వస్తుండటంతో అసలు సినిమా అర్థమైంది. అంతే.. విమర్శలకు తెర దీస్తున్నారు. అసలు చంద్రబాబు సభలకు ఇంత జనమేంటంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
చంద్రబాబు చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలతో రాజకీయ వాతావరణంలో స్పష్టమైన మార్పు వచ్చినట్టు క్లియర్‌గా అర్థమవుతోంది. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు అనుచర గణం బాగా హైలైట్ చేస్తోంది. చంద్రబాబు రోడ్‌షోలకు జనం భారీగా తరలి రావడం ఒక ఎత్తైతే.. ఆ స్థాయిలో జనం వస్తున్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం ఒక ఎత్తు. దీనిని చంద్రబాబు సక్సెస్‌ఫుల్‌గా యూజ్ చేసుకుంటున్నారు. డ్రోన్ ఫోటోలు, వీడియోలు, టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. ఇక నెక్ట్స్ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా టీడీపీ రావడం ఖాయమనే సంకేతాన్ని ఈ ఫోటోలు, వీడియోల ద్వారా చంద్రబాబు పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు.
చంద్రబాబు పుంగనూరు పర్యటన ఎంత ఉద్రిక్తంగా మారిందో చెప్పనక్కర్లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లు, పుంగనూరు ప్రాంతాలు రణరంగంగా మారాయి. చంద్రబాబు పర్యటనను అడుగడుగునా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అయినా కూడా చంద్రబాబు భయపడలేదు. వెనుకడుగు వేయలేదు. పైగా మరోసారి పుంగనూరు వస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. పుంగనూరు రోడ్లపై తాము తిరగకూడదా? అని ప్రశ్నించారు. మొన్నే పులివెందులలో పొలికేక వినిపించానని, ఇప్పుడు పుంగనూరులో గర్జిస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి ఎక్కడా అదరని.. బెదరని చంద్రబాబుని చూశాం. ఈసారి వైసీపీతో తాడో పేడో తేల్చుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.