Advertisementt

భోళా హిందీలో అంట.. కామెడీ!

Tue 15th Aug 2023 07:47 PM
bholaa shankar,hindi release,chiranjeevi,comedy  భోళా హిందీలో అంట.. కామెడీ!
Bholaa Shankar Release in Hindi Also భోళా హిందీలో అంట.. కామెడీ!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ మూవీ భోళా శంకర్ గత శుక్రవారం విడుదలైంది. ఆ సినిమా రిజల్ట్ తో మెగా ఫాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరు జడ్జిమెంట్‌ని అందరూ తెగ విమర్శించేస్తున్నారు. మెహర్ రమేష్ అవుట్ డేటెడ్ దర్శకుడు అలాంటి వాడిని నమ్మి భారీ బడ్జెట్ పెట్టి సినిమా తియ్యడం చిరు చేసిన పెద్ద మిస్టేక్ అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎక్కువయ్యాయి. భోళా ఎంత ఎంత పెద్ద ప్లాప్ అయ్యిందో అనేది అందరికీ తెలిసిందే. 

అయితే ఇలాంటి సినిమాని ఇప్పుడు హిందీలో రిలీజ్ చేస్తారంటూ స్ప్రెడ్ అయిన వార్తలతో అందరూ నవ్వుకుంటున్నారు. తెలుగులో కనీసం యావరేజ్ కూడా అవ్వని సినిమాని హిందీలో రిలీజ్ చేస్తారా అంటూ కామెడీ చేస్తున్నారు. ఆగష్టు 25న భోళా శంకర్ హిందీ రిలీజ్ అంటూ వార్తలు సోషల్ మీడియాలో కనిపించగానే మెగా ఫాన్స్ ని మిగతా హీరోల ఫాన్స్ ఆటపట్టిస్తున్నారు. డిజాస్టర్ సినిమాలని కూడా హిందీలో విడుదల చేస్తే ఉన్న పరువు పోతుంది అంటున్నారు. 

మరి నిజంగానే భోళా శంకర్ ని హిందీలో మేకర్స్ విడుదల చేస్తారా? అనేది అయితే ఒక పక్క సస్పెన్స్.. మరోపక్క కామెడీగానూ కనిపిస్తుంది. ఈ విషయమై భోళా మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ విషయంలో సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Bholaa Shankar Release in Hindi Also:

Trollers Comedy on Bholaa Shankar Hindi Release News

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ