Advertisementt

రేణు దేశాయ్ ని కూడా వదలడం లేదు

Tue 15th Aug 2023 10:16 AM
pawan kalyan  రేణు దేశాయ్ ని కూడా వదలడం లేదు
YCP targets Renu Desai రేణు దేశాయ్ ని కూడా వదలడం లేదు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ పై ఎలా రివెంజ్ తీర్చుకోవాలో.. ఎలాంటి కామెంట్స్ చేస్తే పవన్ కి ఎఫెక్ట్ అవుతుందో అనేది వైసీపీ వాళ్ళు బాగా ఫాలో అవుతున్నారు. పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలని విమర్శిస్తుంటే.. వారు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, పెళ్ళాలు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన్ని విమర్శించడానికి మరే కారణం లేదు. 

ఇక ఇప్పుడు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మంచివాడు అంటూ చెప్పిన వీడియో వలన వైసీపీ నేతలు రేణు దేశాయ్ ని కూడా వదలడం లేదు. పవన్ కళ్యాణ్ నే కాదు ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ని టార్గెట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ కి రాజకీయాల్లో సపోర్ట్ చేయమంటూ ఏపీ ప్రజలకి రేణు దేశాయ్ రిక్వెస్ట్ చేసింది. అదిగో అక్కడే రేణు దేశాయ్ వైసీపీ బ్యాచ్ కి అడ్డంగా దొరికేసింది. 

అంబటి రాంబాబు అయితే అమ్మా రేణు మీ మాజీకి చెప్పు మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని ! అంటూ ట్వీట్ చెయ్యడమే కాదు PK  ప్యాకేజి స్టార్-రేణు దేశాయ్ సబ్ ప్యాకేజి స్టార్ అంటూ మీడియా ముందు కూడా బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఆమె వదిలిన వీడియోతో వైసీపీ నేతలు అలెర్ట్ అయ్యారు. అందుకే పవన్ కి ప్రజలు ఎక్కడ అవకాశం ఇస్తారో అని భయపడిపోయి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా రేణు దేశాయ్ మీద పడ్డారు. 

YCP targets Renu Desai:

PK Package Star, Renu Desai Sub-Package Star!

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ