మెగాస్టార్ చిరంజీవి కొద్దిరోజుల పాటు షూటింగ్స్ కి దూరంగా గత రెండు రోజులుగా మెగాస్టార్ చిరంజీవి మోకాలి సర్జరీపై రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ విషయమై మెగా కాంపౌండ్ నుండి ఎలాంటి క్లారిటీ లేకపోయినా.. చిరు మాత్రం షూటింగ్స్ కి కొద్దిపాటి బ్రేక్ ఇవ్వబోతున్నారని మాత్రం తెలుస్తుంది. భోళా శంకర్ రిజల్ట్ తో కొద్దిగా డిస్పాయింట్ అయిన చిరు ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు.
అయితే భోళా శంకర్ తర్వాత చెయ్యాల్సిన కళ్యాణ్ కృష్ణ మూవీ కూడా చిరు మొన్న వెకేషన్స్ కి వెళ్లొచ్చిన తర్వాత మొదలు పెట్టేస్తామన్నట్టుగా అప్ డేట్ ఇచ్చారు. తన మోకాలి ఆపరేషన్ ని బెంగుళూరు కానీ, హైదరాబాద్ లో కానీ చేయించుకునే అవకాశం ఉంది అని తెలుస్తుంది.. అయితే ఇప్పుడు చిరంజీవి మోకాలి ఆపరేషన్ తర్వాత రెండు నెలలు రెస్ట్ తీసుకున్నాకే మళ్ళీ కొత్త సినిమా గురించి ఆలోచిస్తారని తెలుస్తుంది.
అంటే ఆగస్టు 22 న చిరు బర్త్ డే రోజున కొత్త సినిమా ఊసు వినిపించకపోవచ్చని మెగా ఫాన్స్ అనుకుంటున్నారు.