అనిల్ సుంకరకు భోళా శంకర్ భారీ నష్టాలు మిగల్చడం కన్నా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా కోసం అనిల్ సుంకర ముక్కుపిండి పారితోషకం వసూలు చెయ్యగా.. అనిల్ సుంకర ఆస్తులు తాకట్టు పెట్టాడని కొందరు, అబ్బబ్బే.. అనిల్ సుంకర హైదరాబాద్ చివార్లలోని స్థలాలను విక్రయించాడని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అదలా ప్రచారంలో ఉండగా.. మెగాస్టార్ భోళా శంకర్ తీసిన అనిల్ సుంకరకి దాదాపు 70-80 కోట్ల నష్టం వాటిల్లే సూచనలు ఉన్నాయి అనే న్యూస్ మెగా ఫాన్స్ ని మరింతగా కలవర పెడుతుంది. మరి 70 అన్నా, 80 అన్నా చిన్న అంకేమి కాదు.. అన్ని కోట్లు అంటే అనిల్ సుంకర ఆస్తులు అమ్మాడు అనడంలో అబద్దం లేదు అనిపిస్తుంది. అతను ఇంత భారీగా నష్టపోతే ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదు.
అసలు మెగాస్టార్ సినిమాలు ఆచార్య-భోళా శంకర్ లు ఇంత భయంకరమైన డిజాస్టర్స్ అవుతాయని ఎవరూ ఊహించలేదు. అయితే ఇదంతా ఒకరి మీద నెట్టేసే నెపం కాదు, అసలు వేదాళం రీమేక్ ఆలోచన ఒక మిస్టేక్. ఈ చిత్రానికి మెహర్ రమేష్ ఎంపిక ఇంకా పెద్ద మిస్టేక్.. అంటూ మెగా అభిమానులే తెగ ఫీలైపోతున్నారు.