వారం వారం సినిమాల రిలీజ్ లు, ప్రేక్షకుల హడావిడితో థియేటర్స్ దగ్గర సందడి కనిపిస్తూనే ఉంది. అందుకే ప్రతి వారం ఏయే చిత్రాలు విడుదలవుతున్నాయా అని యూత్ అంతా ఎదురు చూస్తారు. గత వారం జైలర్, భోళా శంకర్ లతో సరిపెట్టుకున్న ఆడియన్స్.. వచ్చే వారం మాత్రం చిన్న సినిమాలతో బాక్సాఫీసు సరిపెట్టుకోబోతుంది. వచ్చే వారం అంటే ఆగస్టు 18 న మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్ కుమార్ చిత్రాలు పోటీ పడుతున్నాయి. సయ్యద్ సోహెల్, సంతోష్ శోభన్ లు ఇద్దరూ పోటీకి రాబోతున్నారు.
థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఓటీటీలపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా మంచి కంటెంట్ ఉన్న కొత్త చిత్రాలని ప్రేక్షకులకి అందించడానికి ట్రై చేస్తూనే ఉన్నాయి. మరి ఈ వీక్ ఓటిటీలలో విడుదలయ్యే చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ కాబోతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
అమెజాన్ ప్రైమ్ :
హర్లాన్ కొబెన్స్ షెల్టర్ (వెబ్‌సిరీస్) ఆగస్టు 18
జీ5 :
ఛత్రపతి (హిందీ) ఆగస్టు 15
స్టోరీస్ నాట్ టూబీ టోల్డ్ (హాలీవుడ్) ఆగస్టు 15
లయన్స్ గేట్ ప్లే :
మైండ్ కేజ్ (హాలీవుడ్) ఆగస్టు 15
నెట్ ఫ్లిక్స్ :
అన్‌టోల్డ్: ఆల్ ఆఫ్ షేమ్ (హాలీవుడ్) ఆగస్టు 15
నో ఎస్కేప్ రూమ్ (హాలీవుడ్)ఆగస్టు 15
డెప్ వర్సెస్ హర్డ్ (డాక్యుమెంటరీ సిరీస్) ఆగస్టు 16
గన్స్ అండ్ గులాబ్స్ (హిందీ సిరీస్) ఆగస్టు 18
మాస్క్ గర్ల్ (కొరియన్ సిరీస్) ఆగస్టు 18
జియో :
తాలీ (హిందీ) ఆగస్టు 15
ఫ సే ఫాంటసీ (హిందీ) ఆగస్టు 15
ఈటీవీ విన్ :
అన్నపూర్ణా ఫొటో స్టూడియో ఆగస్టు 15