మెగాస్టార్ చిరంజీవి కన్నా మహేష్-ఎన్టీఆర్ గ్రేట్ అంటున్న శ్రీరెడ్డి. మెగా ఫ్యామిలీపై ఒంటికాలుపై లేచే శ్రీరెడ్డి మెగా బ్రదర్స్ చిరంజీవి-పవన్ కళ్యాణ్ నటించిన బ్రో-భోళా శంకర్ సినిమాలు పోవడంపై సెటేరికల్ కామెంట్స్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మెగాస్టార్ చిరు కన్నా మహేష్-ఎన్టీఆర్ గ్రేట్ అంటూ వీరు సినిమాలు ప్లాప్ అయినా కూడా దర్శకులని ఒక్క మాట అన్నారు. కానీ మెగాస్టార్ మాత్రం సినిమాలు పొతే దర్శకులనే ఇరికిస్తారంటూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
మూవీ లో ఏ సీన్ ఎంత వరకు ఉండాలో, ఎక్కడకు కట్ చెయ్యాలో మీరు, మీ ఇంట్లో వాళ్ళు నిర్ణయిస్తారు, సినిమా హిట్ అయితే ఇది సమిష్టి కృషి అంటారు, ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే, డైరెక్టర్ చెప్పాడు చేశాం అని భారం మొత్తం డైరెక్టర్ మీదకు తోసేస్తారు 🙄
సినిమా ఫ్లాప్ అయితే, తన తప్పు లేకపోయినా, నేను ఓకే చెయ్యటం వల్లే జరిగిందేమో అని బాధపడే మహేష్ బాబు గారు 🙏
అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ ని కూడా, తన గురించి ఒక్క ముక్క కూడా తప్పుగా మాట్లాడని ఎన్టీఆర్ గారు 🙏 అంటూ ట్వీటేసింది.
అంటే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ప్లాప్ అవడం పట్ల కొరటాల పేరు తియ్యకుండానే దర్శకులని బ్లేమ్ చేసారు. కానీ మహేష్ తన సినిమా పొతే.. ఒకేరోజు గదిలో కెళ్ళి తలుపేసుకుని సైలెంట్ గా ఉంటారని చెప్పారు. ఇప్పుడు శ్రీరెడ్డి దానిని ఉద్దేశించే పై విధంగా ట్వీట్ చేసింది. అంతేకాని మెగాస్టార్ చిరంజీవి కన్నా మహేష్, ఎన్టీఆర్ గొప్ప అని కాదులే అంటూ కొంతమంది శ్రీరెడ్డి ట్వీట్ పై స్పందిస్తున్నారు.