శని, ఆదివారాలు వీకెండ్.. సోమవారం ఒక్కరోజే వర్కింగ్ డే... మళ్ళీ రేపు మంగళవారం ఆగష్టు 15. అంటే మరో హాలిడే. ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే లాంగ్ వీకెండ్ హైదరాబాద్ వాసులు చాలామంది ఈ వీకెండ్ ఎంజాయ్ చెయ్యడానికి సొంత ఊర్లకి వెళ్లిపోయారు. మరికొంతమంది బాక్సాఫీసు వద్ద ఏం సినిమాలున్నాయి అని వెతుకులాట. కానీ థియేటర్స్ లో ప్రేక్షకులని ప్రభావితం చేసే సినిమాలు లేవు. గత గురు, శుక్రవారాల్లో సూపర్ స్టార్, మెగా స్టార్ సినిమాలు విడుదలయ్యాయి.
తెలుగులో విడుదలైన జైలర్ సినిమా తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదు. జైలర్ కి టాలీవుడ్ లో ప్రేక్షకులు, క్రిటిక్స్ అంతా మిక్స్డ్ టాక్ ఇచ్చారు. ఇక తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన మెగాస్టార్ భోళా శంకర్ కూడా ప్రేక్షకులని డిస్పాయింట్ చేసింది. దానితో ప్రేక్షకులు ఈ వీకెండ్ బాగా బోర్ గా ఫీలవుతున్నారు. ఈ సెలవలకి ఓ సినిమా చూసి ఎంజాయ్ చేద్దామనుకుంటే.. ఈ సినిమాలేమో నిరాశపరుస్తున్నాయి.
సూపర్ స్టార్, మెగాస్టార్ ఇద్దరి పెద్ద సినిమాలొస్తున్నాయంటే ఈ మీడియం హీరో కానీ, చిన్న హీరో కానీ అస్సలు సాహసం చెయ్యరు. అందుకే ఈ సినిమాల మధ్యలో ఏ సినిమా విడుదలకాకపోయేసరికి ఆడియన్స్ బాగా బోర్ ఫీలవుతున్నారు.