రష్మిక మందన్న ఆనందం చూస్తే అబ్బో అంటారు. తెలుగులో సూపర్ సక్సెస్ అయిన రశ్మికకి హిందీ, తమిళ్ వరసగా ఝలక్ లిస్తున్నాయి. తమిళనాట విజయ్ తో కలిసి వారిసు తో ఓ హిట్ కొడదామనుకుంటే అది రష్మికని బాగా డిస్పాయింట్ చేసింది. రిజల్ట్ విషయం పక్కనబెడితే ఆ చిత్రంలో రష్మిక డమ్మీ కేరెక్టర్ లో కనిపించింది. ఇక అంతకుముందే కార్తీ సుల్తాన్ తో బిగ్గెస్ట్ ప్లాప్ ఇచ్చాడు.
ఈ మద్యన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో రష్మిక రొమాన్స్ చేయబోతుంది అనే వార్తల నేపథ్యంలో ఆ సినిమాపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ధనుష్ 50 లోకి రశ్మికకి వెల్ కమ్ చెబుతూ ఇచ్చిన అప్ డేట్ తో రశ్మిక తెగ సంతోష పడిపోతుంది. Beginning of a new journey.💃🏻❤️#D51 న్యూ జర్నీ అంటూ ఆనందంతో చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో ధనుష్ తో రష్మిక హీరోయిన్ గా కన్ ఫామ్ అవ్వగా ఈ చిత్రంలో కింగ్ నాగార్జున ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇదో మల్టీస్టారర్ గా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతుంది. అందుకే రష్మిక అంతగా ఎగ్జైట్ అవుతుంది.