ఏకే ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్ సినిమాల్తో సత్తా చాటుదామని అనుకుంటే వాళ్ళకి ఆ భారీ సినిమాలే వరసగా షాకిస్తున్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి తో భోళా శంకర్ సినిమా చెయ్యగా దాని రిజల్ట్ అనిల్ సుంకరకి బిగ్ ఝలక్ ఇచ్చింది. సినిమా పోవడమో నిర్మాత అనిల్ సుంకరకు మెగాస్టార్ కి మనస్పర్థలు, అనిల్ సుంకర నుండి చిరంజీవి ముక్కుపిండి పారితోషకం వసూలు చేసారు. తన పారితోషకం మొత్తం ఇస్తేనే కానీ కుదరదని అనిల్ సుంకర ని చిరు డిమాండ్ చేసారు, దానితో ఆయన చేసేది లేక ఆస్తులని తాకట్టు పెట్టి మొత్తం కట్టారంటూ సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.
అయితే ఈ వార్తలపై మెగా అభిమాని, బేబీ దర్శకుడు సాయి రాజేష్ ఓ రేంజ్ లో ఫైరయ్యాడు. నిజం చెప్పులేసుకునే లోపు అబద్దం ఊరంతా చుట్టేస్తోంది. ఇంకో వారం రోజులపాటు చిరంజీవి ముక్కుపిండి నిర్మాత నుండి ఎలా వసూలు చేసాడో అనేది రకరకాల వార్తలు వస్తాయి. ఇటు పక్క ఎలాగో నిజం చెప్పే మనిషి ఉండడు, మేము మెగాస్టార్ చిరు గారి ఆఫీస్ లో ఉన్నప్పుడు అనిల్ సుంకరు గారు వస్తే ఆయన్ని వెయిట్ చేయించాడని తెలిసి పిలిచి పైకి రాగానే ఆయనే ఐరెన్ సోఫా జరిపి మరీ కూర్చోబెట్టారు.
పని మనిషి తీసుకొచ్చిన కాఫీని ఆయన స్వయంగా మా ముగ్గురికి అందించారు. నిర్మాతలకి ఆయనిచ్చే మర్యాద అలాంటిది. ఈ వార్తలని చూసి చాలా బాధతో నేను అనిల్ గారు దగ్గర పని చేసే ఒక వ్యక్తికి ఫోన్ చేసి అడిగి విషయం తెలుసుకున్నాను. ఇదంతా పచ్చి అబద్దం. మా బాస్ మీరనుకున్నట్లుగా కాదు. ఆయన వేరే మా బాస్ చిరంజీవి గారిని చూసి నేను గర్వపడుతున్నాను అంటూ సాయి రాజేష్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.