సమంత కి కోపమొచ్చింది అంటే సోషల్ మీడియా వేదికగా ఇచ్చి పడేస్తుంది. సమంత అడుగేసినా తప్పే, అడుగు తీసినా విమర్శే అన్నట్టుగా ఆమెని పదే పదే ట్రోల్ చేస్తూనే ఉంటారు. అందుకే సమంత కూడా గట్టిగానే సమాధానం చెబుతుంది. నాగ చైతన్య తో విడాకులయ్యాక సమంతని తెగ ట్రోల్ చేసారు. తాను ఆ విడాకుల బాధని అనుభవిస్తూనే ట్రోలర్లకి ఇచ్చే ఆన్సర్ ఇచ్చేసింది.
తాజాగా సమంత ఖుషి మూవీ పప్రమోషన్స్ లో కనిపించకుండా విహార యాత్రల్లో కనిపిస్తుంది. దానితో సమంతకి సినిమా ప్రమోషన్స్ కన్నా ఎక్కువ ఏముంది, ఖుషి ప్రమోషన్స్ కి హాజరవకుండా ఎంజాయ్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో విమర్శలు స్టార్ట్ చేసారు. దానితో కోపమొచ్చిన సమంత డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
మీరు ఈ ప్రపంచం కోసం జీవించాల్సిన అవసర లేదు. మీ గౌరవాన్ని మీరు తెల్సుకోవాలి. మీ స్థాయిని మీరే పెంచుకోవాలి, మీ గౌరవాన్ని మీరే కాపాడుకోవాలి. మిమ్మల్ని ఈ సమాజం గుర్తించకపోవచ్చు. అయితే మీరు అలా ఉండకూడదు. పదిమందిలో ఒకరిలో కాకుండా మీ కోసం మీరు నిలబడడం అనేది చాలా అవసరమంటూ సమంత చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.