మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ గత శుక్రవారమే విడుదలయింది. వాల్తేర్ వీరయ్య హిట్ తర్వాత విడుదలైన ఈ చిత్రంపై మంచి హోప్స్ ఉన్నాయి కానీ.. వాటికి నిలబెట్టుకోవడంలో మాత్రం భోళా శంకరుడు తడబడ్డాడు. మెగాస్టార్ చిరు భోళా శంకర్ డిసాస్టర్ గా తేల్చేసారు. అటు ఆడియన్స్ ఇటు క్రిటిక్స్. కనీసం ఫస్ట్ వీకెండ్ కూడా భోళా శంకర్ బాక్సాఫీసుని ఊపలేకపోయింది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నారనే న్యూస్ ఉంది.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి.. ఈ నెల 22 న తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నారు అనే ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు చిరు కొత్త సినిమా అప్పుడే ఉండకపోవచ్చను తెలుస్తుంది. కారణం ఆయన మోకాలికి ఆపరేషన్ చేయించుకునే ఆలోచనలో ఉన్నారట. సినిమాల్లో డాన్స్, యాక్షన్ అవి చేస్తూ ఉంటారు. దాని వలనే ఆయన మోకాలికి దెబ్బ తగలడమో లేదంటే మరొక సమస్యోకాని.. ప్రస్తుతం అయితే ఆయన ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారట..
చిరు ఈ మోకాలి ఆపరేషన్ కోసం ఆయన విదేశాలకి వెళ్లాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. ఆపరేషన్ తర్వాత ఆయన ఓ నెల రోజులు రెస్ట్ తీసుకున్నాకే తదుపరి చిత్రం మొదలు పెట్టాలనుకుంటున్నట్లుగా సమాచారం. అందుకే చిరు-కళ్యాణ్ కృష్ణ సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది అంటున్నారు.