Advertisementt

‘సైంధవ్’‌ని శైలేష్ పరుగెట్టిస్తున్నాడు

Tue 15th Aug 2023 12:55 PM
venkatesh,saindhav,update,sailesh kolanu  ‘సైంధవ్’‌ని శైలేష్ పరుగెట్టిస్తున్నాడు
Saindhav Done With Intense Schedule ‘సైంధవ్’‌ని శైలేష్ పరుగెట్టిస్తున్నాడు
Advertisement
Ads by CJ

విక్టరీ వెంకటేష్‌తో ‘హిట్’ సిరీస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సైంధవ్’. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక చిత్రం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఇది విక్టరీ వెంకటేష్‌కి 75వ చిత్రం. వెంకీ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ పరుగులు పెట్టిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ విడుదల చేశారు.

సుమారు 16 రోజుల పాటు జరిగిన కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసినట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ షెడ్యూల్‌లో ఎనిమిది మంది ముఖ్య నటీనటులు షూట్‌లో పాల్గొనగా.. హై-ఆక్టేన్ ఎమోషనల్ క్లైమాక్స్‌ను హర్ష్ కండీషన్స్‌లో చిత్రీకరించినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ సూపర్ వైజ్ చేసినట్లుగా తెలుపుతూ.. వెంకటేష్‌కి ఇప్పటి వరకు ఇదే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ క్లైమాక్స్ పోర్షన్ అని.. చాలా అద్భుతంగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ షెడ్యూల్ మాత్రమే కాదు.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ మొత్తంపై వెంకటేష్ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ మైల్‌స్టోన్ మూవీ కోసం నిర్మాత ఖర్చు విషయంలో వెనుకాడటం లేదని.. ఎంత ఖర్చు అయినా సరే.. వెంకీకి, ఆయన ఫ్యాన్స్‌కి ఎప్పటికీ చెప్పుకునే చిత్రాన్ని తమ బ్యానర్ ఇవ్వాలనే ధ్యేయంతో ఉన్నారట. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా వంటి వారంతా ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Saindhav Done With Intense Schedule:

Victory Venkatesh Pan India Film Saindhav Climax Wrapped

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ