పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో సముద్రఖని రూపొందించిన చిత్రం ‘బ్రో’. ఈ సినిమా జూలై 28న థియేటర్లలో విడుదలై మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ రాబట్టడంలో మాత్రం ఫెయిలైంది. దాదాపు హిట్టు వరకు చేరుకుంది కానీ.. నెగిటివ్ ప్రచారం ఎక్కువ కావడంతో జనాలు.. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాని చూసేందుకు థియేటర్లకు రాలేదు. దీంతో హిట్టవ్వాల్సిన సినిమా కూడా ఎబౌ యావరేజ్ దగ్గరే నిలబడిపోయింది. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు బ్రేక్ పడే టైమ్ వచ్చేసినట్లే అనిపిస్తోంది.
‘బ్రో’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లుగా సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. ఆ వినిపించే పోస్ట్‌లలో నిజం ఉంటే మాత్రం బ్రో సినిమా ఈ నెలలోనే ఓటీటీలోకి వచ్చేయనుంది. అంటే విడుదలైన 4 వారాల అనంతరం ఈ సినిమా ఓటీటీలో సందడి చేసే ఛాన్సుంది. బ్రో సినిమా ఆగస్ట్ 25 లేదా 26వ తేదీలలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. బ్రో డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ రేటుకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. థియేటర్లలో మిస్సయిన వారంతా.. ఓటీటీలో ఈ సినిమాని చూసేందుకు ఇంట్రస్ట్‌గా ఉండటంతో కచ్చితంగా ఈ మంత్ ఎండింగ్‌కి బ్రో ఓటీటీలో దర్శనమివ్వడం ఖాయంగా తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైమ్‌గా నటించిన ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ మార్క్ అలియాస్ మార్కండేయులుగా నటించారు. భారీ తారాగణం నటించిన ఈ సినిమాను జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.