Advertisementt

యూత్‌కి స్టైలిష్ ఐకాన్..

Mon 14th Aug 2023 09:15 AM
allu arjun,cover star,travel plus leisure,icon star  యూత్‌కి స్టైలిష్ ఐకాన్..
Allu Arjun Stylish Looks Creates Sensation యూత్‌కి స్టైలిష్ ఐకాన్..
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్.. ఏం హీరో అన్న వారందరి చేతా.. ఏం హీరోరా! అని అనిపించుకుంటున్న ఐకాన్. ఒకప్పుడు స్టైల్‌కి కేరాఫ్ అడ్రస్‌గా పవన్ కళ్యాణ్ నిలిస్తే.. ఆ లెగసీ మెగా హీరోగా కంటిన్యూ చేస్తున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన మొదటి సినిమా టైమ్‌లో ఎన్నో నోళ్లు లేచాయి.. కారు కూతలు కూశాయి. అలాంటి నోళ్లకి, కూతలకి.. తన సక్సెస్సే సమాధానంగా చూపిస్తూ వస్తున్నాడీ ఐకాన్ స్టార్. ‘గబ్బర్ సింగ్’లో ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా.. అనే డైలాగ్‌లా అల్లు అర్జున్ ట్రెండ్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాడు.

హిట్, ఫ్లాప్స్ సినిమా ఇండస్ట్రీలో సహజం. ఒక హిట్ నుంచి ఏం నేర్చుకున్నాం.. ఒక ఫ్లాప్ నుంచి ఏం తెలుసుకున్నాం అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఇది తెలుసుకుని నడిస్తే.. ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించకపోయినా.. డిజప్పాయింట్ మాత్రం చేయరు. ఇప్పుడు బన్నీ చేస్తుంది అదే. ఆయన కష్టానికి తగ్గట్లుగా అన్నీ కలిసొస్తుండటం కూడా బన్నీ లక్‌‌ని తెలియజేస్తుంది. ఆయనికిప్పుడు అభిమానులు కాదు.. ఆర్మీ ఉన్నారు. బ్యాక్‌గ్రౌండ్ చెప్పుకోవడానికి చాలా ఉన్నా.. ఏనాడూ దానిని పట్టించుకోకుండా.. శ్రమే సక్సెస్‌గా దూసుకెళుతున్న అల్లు అర్జున్.. ఎప్పటికప్పుడు స్టైలిష్‌గా అందరినీ ఆకర్షిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

తాజాగా అల్లు అర్జున్ ది ట్రావెల్ అండ్ లీజర్ బ్రాండ్ కవర్ ఫోటో షూట్‌లో పాల్గొన్నాడు. ఈ ఫొటోషూట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో మైండ్ బ్లోయింగ్ అన్నట్లుగా.. కలర్ ఫుల్ అవుట్ ఫిట్‌తో లాంగ్ హెయిర్, గడ్డంతో కేక అనేలా ఉన్నాడు. ఈ షూట్‌లో ఆయన వేసిన అవుట్ ఫిట్స్ కానీ, గాడ్జెట్స్ కానీ.. కిరాక్ అనేలా ఉన్నాయి. ఎందుకు తనని స్టైలిష్ సార్ అంటారో.. ఈ లుక్‌తో మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. ఈ లుక్‌లో బన్నీని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

Allu Arjun Stylish Looks Creates Sensation:

Icon star Allu Arjun is the August cover star of Travel Plus Leisure

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ