Advertisementt

ఈసారి కాజల్ పక్కా..

Sun 13th Aug 2023 04:09 PM
kajal aggarwal,king nagarjuna,tabu,malayalam remake  ఈసారి కాజల్ పక్కా..
Kajal Aggarwal to Romance with Nag for His Next Movie ఈసారి కాజల్ పక్కా..
Advertisement
Ads by CJ

ఈసారి కింగ్ నాగార్జున సరసన చందమామ కాజల్ అగర్వాల్ పక్కాగా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ఘోస్ట్’ చిత్రంలో మొదట కాజల్ అగర్వాల్‌ని అఫీషియల్‌గా ప్రకటించారు. కానీ, ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో.. ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత కాజల్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె ప్లేస్‌లోకి సోనాల్ చౌహాన్‌ను తీసుకుని.. మళ్లీ షూటింగ్ జరిపారు. ఇప్పుడు కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

నాగార్జున సరసన ‘ది ఘోస్ట్’ చిత్రంలో నటించలేకపోయినందుకు కాజల్ చాలా బాధపడిందట. అంతేకాదు, ఈ సినిమాలో తనకి వచ్చిన పాత్రని చాలా ఇష్టపడ్డానని, అలాంటి పాత్రలలో చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నానని.. ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అవకముందు కాజల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కానీ ఆ ఛాన్స్ మిస్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు నాగార్జున సరసన తనకు మరోసారి ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈసారి మాత్రం పక్కా.. అనేలా నాగ్ ప్రాజెక్ట్‌‌ కోసం కాజల్ వెయిట్ చేస్తుందనేలా టాక్ వినబడుతోంది.

మలయాళంలో సూపర్‌ హిట్టైన పొరింజు మారియన్‌ జోస్ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో కింగ్ నాగార్జున హీరోగా నటించనుండగా.. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇందులో హీరోయిన్‌గా కాజల్‌ని సెలక్ట్ చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం బాలయ్య సరసన కాజల్ భగవంత్ కేసరి అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి నాగ్ సినిమాలో మొదట టబుని నటింపజేయాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు కాజల్‌కి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

Kajal Aggarwal to Romance with Nag for His Next Movie:

Tabu Out and Kajal Aggarwal in for Nagarjuna Next Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ