Advertisementt

బ్రో, భోళా.. ‘దేవర’తో పోటీపడుంటే!

Sun 13th Aug 2023 03:43 PM
sri reddy,bro,bholaa shankar,devara,flops  బ్రో, భోళా.. ‘దేవర’తో పోటీపడుంటే!
Sri Reddy Shocking Comments Bro and Bholaa Shankar బ్రో, భోళా.. ‘దేవర’తో పోటీపడుంటే!
Advertisement
Ads by CJ

రెండు వారాల గ్యాప్‌లోనే, మొదట తమ్ముడు పవన్ కళ్యాణ్ బ్రో సినిమా, తర్వాత అన్నయ్య భోళా శంకర్ సినిమా, దొందు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి, ఎలాంటి పోటీ లేకుండా ఉంటేనే, ఇలా ఫ్లాప్ అయ్యాయి అంటే, ఇంక ఏప్రిల్‌లో దేవర తో పోటీ అంటే సాహసం అనే చెప్పాలి 🙄 అంటూ కాంట్రవర్సీ క్వీన్ శ్రీరెడ్డి వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. 

మెగా ఫ్యామిలీకి యాంటీగా మాట్లాడే శ్రీరెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్, చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు అందుకోవడంపై ఇలా వెటకారంగా ట్వీట్ చేసింది. అసలు ఎలాంటి పోటీ లేకుండానే మెగా బ్రదర్స్ ఇద్దరూ చతికిల పడ్డారంటూ శ్రీరెడ్డి ఇలా ట్వీట్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ OG తో మళ్ళీ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే టాక్ తో శ్రీరెడ్డి మరింత వెటకారంతో ఏప్రిల్ లో దేవర తో పోటీ అంటే సాహసం అనే చెప్పాలి అంటూ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

మొదటి నుంచి అంటే బ్రో సినిమా విడుదలైనప్పుడు, అలాగే భోళా శంకర్ సినిమా విడుదలైనప్పడు.. శ్రీరెడ్డి ఏదో రకంగా ఈ సినిమాలను టార్గెట్ చేస్తూనే ఉంది. బ్రో సినిమా అంత డిజాస్టర్ ఏమీ కాదు.. ఆ సినిమా కలెక్షన్లతో నిర్మాత హ్యాపీగానే ఉన్నారు. భోళా శంకర్ సినిమా తేడా కొట్టినా.. ప్రతి సినిమా హిట్ అవ్వాలనేం లేదు. అలా అనుకుంటే.. శ్రీరెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఉండేది. కోలీవుడ్‌లో తల దాచుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇక్కడ ఏడవ లేక.. అక్కడికి పోయి మొరుగుతుంది అంటూ.. శ్రీరెడ్డి ట్వీట్‌కి మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Sri Reddy Shocking Comments Bro and Bholaa Shankar:

Again Sri Reddy Targets Mega Brothers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ