Advertisementt

వరుణ్, లావణ్యల పెళ్లి అప్పుడు కాదా?

Sun 13th Aug 2023 08:29 AM
varun tej,lavanya tripathi,marriage,not finalized  వరుణ్, లావణ్యల పెళ్లి అప్పుడు కాదా?
Varun Tej and Lavanya Tripathi Wedding Date Not Finalized వరుణ్, లావణ్యల పెళ్లి అప్పుడు కాదా?
Advertisement
Ads by CJ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్యూట్ బ్యూటీ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం జరిగి చాలా రోజులు అవుతుంది. ఇద్దరూ ఈ మధ్య ఫారెన్‌లో కూడా కనిపించారు. డెస్టినేషన్ వెడ్డింగ్ నిమిత్తం మంచి ప్లేస్ కోసం ఇద్దరూ సెర్చ్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక రీసెంట్‌గా ఆగస్ట్ 24న వీరిద్దరి వివాహం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా అతి కొద్ది మంది సమక్షంలో ఉంటుందనేలా ఓ వార్త బయటికి వచ్చింది. మ్యారేజ్ తర్వాత రిసెప్షన్ మాత్రం హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా టాక్ వచ్చింది. 

అయితే ఈ వార్తల్లో నిజం లేదనేలా తెలుస్తుంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహానికి సంబంధించి ఇంత వరకు డేట్ ఫిక్స్ కాలేదనేలా తాజాగా వార్తలు వినిపిస్తుండటం విశేషం. 24న పెళ్లి, 25న వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున సినిమా విడుదల అనేలా ఇప్పటి వరకు టాక్ వినిపిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ మాత్రమే ఉంటుంది. పెళ్లి ఇప్పుడప్పుడే కాదనేలా టాక్ వినబడుతోంది. వాస్తవానికి అసలింత వరకు పెళ్లికి సంబంధించి డేట్‌నే ఫిక్స్ చేసుకోలేదనేలా మెగా వర్గాల నుంచి తెలుస్తోంది. 

ఒక వేళ డేట్ ఫిక్స్ అయి ఉంటే.. ఈ సరికే.. పెళ్లి హడావుడి మొదలవ్వాలి. ఎందుకంటే ఆగస్ట్ 24 అంటే ఇంకా 12 రోజులు మాత్రమే టైమ్ ఉంది. నిజంగా డేట్ ఫిక్సయి ఉంటే.. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో పెళ్లి హంగామా నడుస్తూ ఉండేది. కానీ అలాంటిదేమీ కనిపించడం లేదు. దీంతో.. పెళ్లికి సంబంధించి వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదనేది తెలుస్తోంది. ఈ పెళ్లికి ఇంకా డేట్ ఫిక్స్ చేయకపోవడానికి కారణం.. నిహారిక విడాకులు కూడా అని అంటున్నారు. కుమార్తె విడాకుల వార్త నడుస్తుండగానే.. కొడుకు పెళ్లి అంటే బాగోదని మెగాబ్రదర్ భావిస్తున్నట్లుగా సమాచారం. అందుకే ఇంకొన్ని రోజుల పాటు వరుణ్‌లవ్‌ల పెళ్లిని వాయిదా వేస్తున్నట్లుగా టాక్. పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉన్నాయి.

Varun Tej and Lavanya Tripathi Wedding Date Not Finalized:

 Update on Varun Tej and Lavanya Tripathi Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ