Advertisementt

3 టైమ్స్ బిగ్‌బాస్ ఆఫర్‌ని తిరస్కరించిందట!

Sat 12th Aug 2023 11:39 PM
udaya bhanu,bigg boss telugu,rejected,anchor,3 times  3 టైమ్స్ బిగ్‌బాస్ ఆఫర్‌ని తిరస్కరించిందట!
3Times Anchor Udaya Bhanu Rejected Bigg Boss Offter 3 టైమ్స్ బిగ్‌బాస్ ఆఫర్‌ని తిరస్కరించిందట!
Advertisement
Ads by CJ

బిగ్‌బాస్ ఆఫర్ వస్తే చాలామంది ఎగిరి గంతేస్తారు. కానీ ఈమధ్యన అంటే గత రెండు మూడు సీజన్స్ నుండి బిగ్‌బాస్‌లోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ మూడు సీజన్స్ అంత వరెస్ట్‌గా ఉన్నాయి. టీఆర్పీ రేటింగ్స్ కూడా బాగా పూర్‌గా ఉన్నాయి. అందుకే బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినా వెళ్ళడానికి భయపడుతున్నారు. అక్కడికెళితే ఉన్న పేరు పోతుంది అని. బిగ్ బాస్‌లోకి వెళ్లేముందు ఉన్న కాస్తో కూస్తో క్రేజు.. బిగ్‌బాస్‌కి వెళ్ళొచ్చాకా అస్సలు ఉండడం లేదు. అందుకే ఇప్పుడు కొంతమంది బిగ్‌బాస్‌కి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. 

తాజాగా ఓ స్టార్ యాంకర్ బిగ్‌బాస్ నుండి మూడుసార్లు ఆఫర్ వచ్చినా వెళ్లలేదట. బిగ్‌బాస్ మొదటి సీజన్ అలాగే మూడో సీజన్స్‌కి యాంకర్ ఉదయభానుని బిగ్ బాస్ హౌస్ కి రమ్మని ఆహ్వానించినా ఆమె తనకి చిన్న పిల్లలు, వారి దగ్గర ఉండాలని చెప్పి తప్పించుకుంది. ఇప్పుడు సీజన్ 7కి అయినా రండి పిల్లలు పెద్దవాళ్ళయ్యారుగా అని మళ్ళీ ఈ సీజన్‌కి ఆహ్వానిస్తే..  ఉదయభాను మళ్ళీ తిరస్కరించిందట. అంటే ఇప్పటికి ఉదయభానుకు మూడుసార్లు ఆఫర్ రాగా.. మూడుసార్లు తిరస్కరించిన వ్యక్తిగా ఉదయభాను నిలిచింది అని చెబుతున్నారు. 

ఇక ఈ సీజన్‌లోకి వెళ్ళేవాళ్ళు వీరే అంటూ చాలామంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో టీవీ ఆర్టిస్ట్‌లు, యూట్యూబ్ స్టార్స్, అలాగే టిక్ టాక్ స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈటివి ప్రభాకర్.. జబర్దస్త్ వర్ష ఇలా కొందరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

3Times Anchor Udaya Bhanu Rejected Bigg Boss Offter:

Anchor Udaya Bhanu says No to Bigg Boss

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ