Advertisementt

ఇంకోసారి రీమేక్ అంటే ఊరుకోరేమో?

Sat 12th Aug 2023 08:27 PM
bro,bholaa shankar,mega heroes,remakes,unhappy  ఇంకోసారి రీమేక్ అంటే ఊరుకోరేమో?
Mega Fans Serious about Mega Heroes Remakes ఇంకోసారి రీమేక్ అంటే ఊరుకోరేమో?
Advertisement
Ads by CJ

మెగా బ్రదర్స్ చిరంజీవి-పవన్ కళ్యాణ్‌లు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. వరస రీమేక్స్ చేస్తున్నారు. అందులో కొన్ని వర్కౌట్ అయినా.. కొన్ని మాత్రం నీరసాన్ని మిగులుస్తున్నాయి. ఆ నిరాశలో హీరోలెలా ఫీలయినా ఫ్యాన్స్ మాత్రం బాగా హర్ట్ అవుతున్నారు. అందుకే తమ స్టార్ హీరోలు రీమేక్స్ చేస్తున్నారంటే చాలు అభిమానులు వణికిపోతున్నారు. ఇప్పుడు మెగా బ్రదర్స్ ఇద్దరూ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ కొట్టారు. పవన్ కళ్యాణ్ బ్రో తో ఫ్లాప్ కొట్టారు. 

వెనువెంటనే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో వచ్చి డిజాస్టర్ సినిమా ఇచ్చారు. రొటీన్ కథ, పాత చింతకాయ పచ్చడి, కాలం చెల్లిన కథతో మెగాస్టార్ యాక్టింగ్, అసలు మెగాస్టార్ కామెడీ రోత పుట్టింది, అజిత్ వేదాళం ఓకే ఓకే కానీ.. మెగాస్టార్ భోళాని భరించలేము, అసలు మెగాస్టార్ చిరు రీమేక్స్ చేయవద్దు అంటూ ఫ్యాన్స్ నెత్తి నోరూ బాదుకున్నారు. అయితే మంచి కంటెంట్‌ని తెలుగు ప్రేక్షకులకి అందించడంలో తప్పులేదు, ఆ విషయంలో రీమేక్స్ చేస్తే తప్పేంటి? అని మెగాస్టార్ అన్నారు. మంచి కంటెంట్‌ని ప్రేక్షకులకు చెప్పే క్రమంలో రీమేక్స్ చేయడంలో నాకు తప్పేమి కనిపించలేదన్నట్లుగా విడుదలకు ముందు మెగాస్టార్ చెప్పారు. 

ఇప్పుడేమో భోళా శంకర్ రీమేక్ తేడా కొట్టింది. దీనితో ఇకపై మెగా బ్రదర్స్ రీమేక్స్ చేస్తామంటే అంటే మెగా ఫాన్స్ ఒప్పుకోరేమో.. ఒప్పుకోరేమో కాదు ఒప్పుకోరు. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మలయాళ ‘బ్రో డాడీ’ని రీమేక్ చేస్తున్నారనే టాక్ ఉంది. ఈ విషయంలో మెగా అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Mega Fans Serious about Mega Heroes Remakes :

Mega Fans Unhappy with Bro and Bholaa Shankar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ