పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరస సినిమాలతో చాలా బిజీగా కనిపిస్తున్నారు. సలార్ రిలీజ్‌కి రెడీ అవుతుంది. అయితే ఆదిపురుష్ తర్వాత ఓ 50 రోజులపాటు అమెరికాలోనే ఉన్నారు ప్రభాస్. అక్కడే ప్రభాస్ కొద్దిరోజులపాటు ట్రీట్మెంట్ తీసుకుని వచ్చారనే టాక్ ఉంది. అంతేకాకుండా ప్రభాస్ గత ఏడాది మే లో సలార్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మోకాలి ఆపరేషన్ కోసం విదేశాలకి వెళ్లారని అన్నారు.
ఆ తర్వాత ఆదిపురుష్ టీజర్ లాంచ్ సమయంలోనూ ప్రభాస్ నడవలేక కృతిసనన్ సపోర్ట్ కూడా తీసుకున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరోసారి ప్రభాస్ మోకాలి ఆపరేషన్ కోసం విదేశాలకి వెళ్ళబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం సలార్ ప్రమోషన్స్ అలాగే ప్రాజెక్ట్ కే షూటింగ్ పనులు పూర్తి చేశాక ఆయన మోకాలి సర్జరీ చేయించుకునేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ఈ న్యూస్ చూసిన నెటిజెన్స్ అయ్యో ప్రభాస్ మోకాలి ఆపరేషన్ ఎన్నిసార్లు చేయించుకుంటావ్ ప్రభాస్ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ K’ శరవేగంగా ముస్తాబవుతున్నాయి. అర్జున్ రెడ్డి దర్శకుడితో చేయాల్సిన స్పిరిట్ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మరో వైపు సైలెంట్‌గా మారుతితో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు ప్రభాస్.