సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా వార్తలు వినిపించాలో.. అన్ని రకాలుగా వినిపించాయి. సినిమా నుంచి ఒక్కొక్కరు వెళ్లిపోతుండటం, కొత్తవారు వచ్చి చేరుతుండటం వంటి న్యూస్‌తో.. అసలు ఈ సినిమా ఉంటుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే చిత్రయూనిట్ మాత్రం మొదటి నుంచి.. అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు.. టైమ్‌కి అన్నీ సెట్ అవుతాయని చెబుతూ వస్తుంది. యూనిట్ చెప్పినట్లే.. ఈ కారంలో కదలిక వచ్చినట్లుగా అయితే కనిపిస్తోంది.
బర్త్‌డే సెలబ్రేషన్స్ నిమిత్తం ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్ వెళ్లిన మహేష్ బాబు.. తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఆయన ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యామిలీతో కలిసి వస్తున్న ఫొటోలు నెట్‌లో దర్శనమిచ్చాయి. అంటే బాబు షూటింగ్‌కి రెడీ అయినట్లే. మరోవైపు చిత్రయూనిట్ కూడా సినిమా అప్‌డేట్‌ని తెలియజేసింది. ఆగస్ట్ ద్వితీయార్థంలో ఫ్రెష్ షెడ్యూల్ మొదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించినట్లుగానే.. ఆగస్ట్ 16 నుంచి గుంటూరు కారంలో కదలిక రాబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఆగస్ట్ 16 నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో వేసిన సెట్‌లో గుంటూరు కారం చిత్ర షూటింగ్ మొదలవుతుందనేలా టాక్ వినిపిస్తోంది. ఈ స్టూడియోలో సుమారు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటి సెట్‌లో షూటింగ్ చేయనున్నారట. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారని, దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు ఇక్కడే షూటింగ్ ఉంటుందనేలా చిత్ర వర్గాల నుంచి తెలుస్తుంది. దీంతో బాబు ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే, అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు తీరినందుకు. మొత్తానికి బర్త్ డే తర్వాత మహేష్ బాబు.. ఫ్యాన్స్‌కి ఇస్తోన్న ట్రీట్‌గా దీనిని చెప్పుకోవచ్చు.