కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన సినిమాలు మెగా బ్రదర్స్ తెలుగులో రీమేక్స్ చేసారు. అజిత్ తమిళంలో నటించిన వీరం సినిమాని పవన్ కళ్యాణ్ కాటమరాయుడిగా రీమేక్ చేసాడు. తమిళంలోనే అట్టా అట్టా ఆడిన ఆ సినిమాని తెలుగులో పవన్ ని రీమేక్ చెయ్యొద్దని అభిమానులు వేడుకున్నా ఆయన వినలేదు. కాటమరాయుడిగా రీమేక్ చేసి బిగ్గెస్ట్ డిసాస్టర్ అందుకున్నాడు ఆయన. అలా అజిత్ పవన్ కి బిగ్గెస్ట్ ప్లాప్ ని అంటగట్టారు.
ఇక ఇప్పుడు మెగాస్టార్ వంతు. మెగాస్టార్ చిరంజీవి 2015 లో అజిత్ నటించిన వేదాళం ని ఇన్నేళ్లకి అంటే దాదాపుగా ఎనిమిదేళ్ళకి తెలుగులో రీమేక్ చేసారు. అరిగిపోయిన కథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ భోళా శంకర్ ని మొహమాటపడకుండా తిరస్కరించారు టాలీవుడ్ ఆడియన్స్. వేదాళం ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లోను లేదు, ఇంత మంచి కంటెంట్ అందిస్తున్నామంటూ మెగాస్టార్ మొత్తుకున్నా వేదాళం రీమేక్ భోళా శంకర్ చూసాక ఇదేం సినిమారా నాయన అంటున్నారు.
అజిత్ ఛరిష్మాతో వేదాళం అప్పట్లో ఏదో ఆడేసింది. కానీ ఇన్నేళ్లకి అదే కథతో సినిమా చేస్తే.. ఈ జెనరేషన్ కి ఏం ఎక్కుతుంది. పదేళ్లకు పైగా డైరెక్షన్ కి దూరంగా ఉన్న మెహర్ రమేష్ ఏదో పీకేస్తాడు అనుకుంటే.. అవుట్ డేటెడ్ కథ, స్క్రీన్ ప్లే ని కూడా కనీసం సరిగ్గా దిద్దలేకపోయారు. కేవలం చిరంజీవి ఎలివేషన్స్ పైనే దృష్టి పెట్టిన మెహర్ మిగతా సినిమాని గాలికొదిలేశారు.
మరి అజిత్ సినిమాలని అరవం నుంచి పట్టుకొచ్చి తెలుగులో మెగా బ్రదర్స్ చేసిన రీమేక్స్ ని తెలుగు ప్రేక్షకులు మాకు నచ్చలేదు అనేసారు. ఇలా అజిత్ సినిమాలని రీమేక్ చేసి మెగా బ్రదర్స్ ఇద్దరూ మునిగిపోయారు.