పవన్ కళ్యాణ్ బ్రో సినిమా రిలీజ్ అవ్వగానే అంబటి రాంబాబు మీడియా సమావేశం పెట్టి బ్రో సినిమా అలా, పవన్ కళ్యాణ్ ఇలా అంటూ, బ్రో సినిమాలో తన కేరెక్టర్ పెట్టి అవమానించారంటూ చెలరేగిపోయాడు. అంతేకాకుండా బ్రో కి మిక్స్డ్ టాక్ రావడంతో మరింతగా సంతోషపడిపోయిన అంబటి కలెక్షన్స్ నిల్-ప్యాకేజి ఫుల్ అంటూ బ్రో కలెక్షన్స్ పై సోషల్ మీడియాలో వెటకారంగా ట్వీట్ చేసారు. దానితో బ్రో నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ కూడా అంబటికి కౌంటర్ వేశారు. బ్రో కలెక్షన్స్ ని పొలిటిషియన్స్ అయ్యుండి అంబటి ఇలా ట్వీట్స్ వెయ్యడంతో చాలామంది కామెడీగా మాట్లాడారు, మెగా ఫాన్స్ ఫైర్ అయ్యారు.
ఇక ఈరోజు భోళా శంకర్ రిలీజ్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ రిలీజ్ కి ముందు చిరంజీవిపై వైసీపీ నేతలు ఏ విధంగా చెలరేగిపోయారో.. ఆయనేదో రెన్యునరేషన్ గురించి, కలెక్షన్స్ గురించి కామెంట్స్ చేసారని, తమనేదొ అన్నారనుకుని చిరుపై విరుచుకుపడిపోయారు. అయితే భోళా విడుదలయ్యాక చాలామంది మీ రివ్యూ కోసం ఎదురు చూస్తున్నాము, కలెక్షన్స్ చెబుతారని వెయిటింగ్, మీ ట్వీట్స్ కోసం వేచి ఉన్నామంటూ మెగా ఫాన్స్ వైసీపీ నేతలకి పంచులు మీద పంచులు వేస్తున్నారు.