మహేష్ బాబు 15 రోజుల క్రితమే ఫ్యామిలీతో అంటే భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార లతో కలిసి లాంగ్ ట్రిప్ కోసం లండన్ వెళ్లారు. అక్కడ నుండి స్కాట్లాండ్ వెళ్లిన మహేష్ కుటుంభం.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసారు. మహేష్ తన బర్త్ డే ని తన కుటుంభ సభ్యుల సమక్షంలోనే ఆగష్టు 9న లండన్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు.
ఇక విదేశాల్లో ఫ్యామిలీ ట్రిప్ ముగించుకుని మహేష్ తన ఫ్యామిలీతో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఈరోజు ఆగష్టు 11 శుక్రవారం మహేష్ హైదరాబాద్ కి తిరిగొచ్చారు. తన కూతురు సితారతో కలిసి మహేష్ నడుస్తుంటే.. నమ్రత కొడుకు గౌతమ్ తో కలిసి నడుస్తూ కనిపించారు. హైదరాబాద్ కి తిరిగొచ్చిన మహేష్ కొద్దిగా విశ్రాంతితో గుంటూరు కారం షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నారు.
శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా కనిపిస్తుండగా.. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రంలో స్టైలిష్ విలన్ గా జగపతి బాబు కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 12 2024 లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. మహేష్ బర్త్ డే సందర్భంగా వదిలిన అప్ డేట్ లో ఈ నెల మూడో వారం నుండి గుంటూరు కారం కొత్త షెడ్యూల్ మొదలు కాబోతున్నట్టుగా చెప్పారు.