సూపర్ స్టార్ రజినీకాంత్ తన వయసుకు తగ్గ పాత్రలు, కథలను ఎన్నుకోవడంలో శ్రద్ద పెట్టారు. కబాలి, అన్నత్థే , రీసెంట్ గా వచ్చిన జైలర్. ఈ మూవీస్ లో రజినీకాంత్ లుక్స్, ఆయన స్టయిల్ అన్ని తన ఏజ్ కి తగినట్టుగా కాకపోయినా.. ఆయన పాత్రలని ఎలివేట్ చేసేవిలా ఉన్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ కు సరైన సినిమా పడి పదేళ్లు అయింది.ఇప్పుడు జైలర్ తో సూపర్ స్టార్ హిట్ అందుకున్నట్టే కనిపిస్తుంది. 72 ఏళ్ల వయసులో జైలర్ గా రజనీని దర్శకుడు చూపించిన విధానం మాత్రం ప్రశంసనీయం.
రజినీ కూడా ఎక్కువ హడావుడి చేయకుండా.. నెల్సన్ శైలికి తగ్గట్లు సటిల్ గా యాక్ట్ చేస్తూ తన పాత్రను పండించే ప్రయత్నం చేసారు. ప్రధమార్ధం వరకూ రజనీకాంత్ ఇమేజ్, ఇటు కథను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బాగా హ్యాండిల్ చేశారు.
మరోవైపు బాలకృష్ణ కూడా అదే రీతిలో తన వయసుకు, స్థాయికి తగ్గ కథలు ఎంచుకుంటూ వెళుతున్నారు. అఖండగా ఆయన ప్రదర్శించిన అభినయం కానీ.. వీర సింహారెడ్డిగా చూపించిన రాజసం కానీ అందుకే ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఇక రాబోయే చిత్రంలో కూడా ఓ టీనేజ్ గర్ల్ కి తండ్రి పాత్రలోనే కనిపిస్తూ తనదైన ముద్రని చూపించబోతున్నారు బాలయ్య.
మరి రజినీలా, బాలయ్యలా చిరు ఎందుకు ఉండరు. ఆయన తన ఏజ్ ని ఇంకా ఇంకా తగ్గించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారనే విమర్శలు మొదలయ్యాయి. ఖైదీ నెంబర్ 150, ఆచార్య లలో ఈ విమర్శలు మరింతగా ఎక్కువయ్యాయి. గాడ్ ఫాదర్ లో ఓకె. మళ్ళీ వాల్తేర్ వీరయ్యలో యంగ్ లుక్స్ లో కనిపించేందుకు శ్రమ పడ్డారు. ఇక ఇప్పుడు భోళా శంకర్ లోను అంతే. ఆ ట్రైలర్ చూస్తుంటే మెగాస్టార్ చిలిపి చేష్టలు.. కుర్ర హీరోలా ఫోజులు కొట్టడం ఇవ్వన్నీ ఈ ఏజ్ లో అవసరమా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డీసెంట్ గా తన ఏజ్ కి తగిన పాత్రలతో మెగాస్టార్ ఎంచక్కా సినిమాలు చేసుకోవచ్చు..
ఇప్పటికి కుర్ర హీరోయిన్స్ తో డాన్స్ లు వెయ్యడం, స్పెషల్ సాంగ్స్ లో నర్తించడం ఇవన్నీ అవసరమా అంటూ చాలామంది మెగాస్టార్ పై కామెంట్స్ విసురుతున్నారు. సూపర్ స్టార్ రజినిని చూసి నేర్చుకో మెగాస్టార్ అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు.