Advertisementt

సైలెంట్ గా ఓటిటిలోకి ఆదిపురుష్

Fri 11th Aug 2023 10:07 AM
adipurush  సైలెంట్ గా ఓటిటిలోకి ఆదిపురుష్
Adipurush silently entered the OTT సైలెంట్ గా ఓటిటిలోకి ఆదిపురుష్
Advertisement
Ads by CJ

ప్రభాస్ రాముడిగా అవతారమెత్తిన ఆదిపురుష్ జూన్ 16 న థియేటర్స్ లో విడుదలై వివాదాల నడుమ అట్టర్ ప్లాప్ టాక్ తో అతలాకుతలమైంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాతలని నిట్ట నిలువునా ముంచేసింది. ఆదిపురుష్ టీజర్ తోనే విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. సినిమా రిలీజ్ సమయానికి బజ్ క్రియేట్ అయినా.. అది సినిమా విడుదల తర్వాత ఎగిరిపోయింది. 

ఆదిపురుష్ డిసాస్టర్ టాక్ ఓ వైపు, మరోవైపు.. ఆదిపురుష్ ని కాంట్రవర్సీలు చుట్టుముట్టాయి. అయితే జూన్ 16 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు ఓటిటి లో ఎప్పుడొస్తుందో అనేది మేకర్స్ ప్రకటించలేదు. ఎటువంటి ప్రకటన లేకుండానే ఆదిపురుష్ నేటి నుండి అంటే ఆగష్టు 11 నుండి ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. ఆదిపురుష్ కోసం అమెజాన్ ప్రైమ్ దాదాపుగా 150 కోట్లు పైనే డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. 

ఇక సినిమా పోవడంతో ఎలాంటి హడావిడి లేకుండానే మేకర్స్ ఆదిపురుష్ ని స్ట్రీమింగ్ కి తెచ్చేసారు. ఒక్కసారిగా ఓటిటిలో ప్రత్యక్షమయిన ఆదిపురుష్ ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. 

Adipurush silently entered the OTT:

Adipurush is now streaming on this OTT platform

Tags:   ADIPURUSH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ