కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి పూణే లోను అప్పుడప్పుడు హైదరాబాద్ లోను కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకుని ఇద్దరి పిల్లల్తో కలిసి ఉంటున్న రేణు దేశాయ్ అప్పుడప్పుడు పిల్లల విషయంలో పవన్ ఫాన్స్ తో ఫైట్ కూడా చేస్తుంది. ఇక పవన్ కూడా రేణు దేశాయ్ కి విడాకులిచ్చాక అన్నా లేజ్నోవాని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు.
అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కాస్త ఊపందుకున్నాక ఏపీలోని వైసీపీ నేతలు, ఆఖరికి సీఎం జగన్ కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, చొక్కాలని మార్చినట్టుగా భార్యలను మారుస్తున్నాడు.. ఇంక సీఎం అయ్యి ఏపీ ప్రజలని ఏం ఉద్ధరిస్తాడు అంటూ పవన్ ని టార్గెట్ చేస్తున్నారు.
పదే పదే పవన్ కళ్యాణ్ ని మూడు పెళ్లిళ్లు అంటూ ఎప్పటినుండో టార్గెట్ చేస్తుంటే.. సడన్ గా రేణు దేశాయ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉత్తముడు అంటూ ఓ వీడియో వదలడం వెనుక పవన్ ఉన్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు రేణు దేశాయ్ కూడా పవన్ కి విడాకులిచ్చాక కొన్నాళ్ల తర్వాత ఓ యువ హీరోతో సహజీవం చేస్తుంది అనే అభియోగాలను మోస్తున్న ఆమె సడన్ గా ఈరోజు తన ఇన్స్టా పేజీ లో ఓ వీడియో పోస్ట్ చేసింది.
పవన్ కళ్యాణ్ మంచివాడు, తన మాజీ భర్తకి రాజకీయాల్లో తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆయన రాజకీయాల్లో ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నాడు. ఆయనకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఆయన డబ్బుమనిషి కాదు, ఆయన్ని పదే పదే మూడు పెళ్లిళ్లు అంటూ వేధించడం ఆపండి.. ఆయన స్వచ్ఛమైన మనిషి.. ఆయన్ని రాజకీయాల్లో సపోర్ట్ చేయమని వేడుకుంది.
మరి ఇన్నాళ్లుగా పవన్ పై వైసీపీ నేతలు సెటైర్స్ వేస్తున్నారు. ఎప్పుడు లేనిది.. ఇప్పుడు రేణు దేశాయ్ ఇలా ఓపెన్ అవడం వెనుక పవన్ ఉన్నాడా.. ఆయనే ఇలా రేణు దేశాయ్ తో ప్రకటన చేయించాడా అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రేణు దేశాయ్ ఓ వీడియో వదిలితే.. పవన్ కి రాజకీయంగా ప్రజల్లో సింపతీ క్రియేట్ అవుతుంది అని భావించే పవన్ కళ్యాణ్ తన మాజీ భార్య రేణు దేశాయ్ తో ఇలాంటి వీడియో చేయించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.