Advertisementt

జైలర్ ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్

Thu 10th Aug 2023 07:25 PM
rajinikanth  జైలర్ ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్
Jailer OTT Partner Revealed జైలర్ ఓటిటీ పార్ట్నర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ ఈ రోజు ఆగష్టు 10 న ఆడియన్స్ ముందుకు వచ్చింది. ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైన జైలర్ మూవీకి తెలుగులో మిక్స్డ్ రివ్యూస్, మిక్స్డ్ టాక్ వచ్చింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ రజినీకాంత్ ని ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ అదిరింది. సెకండ్ హాఫ్ స్లో గా ఉన్నా ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. 

అనిరుధ్ రవిచంద్రన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీషరాఫ్ పాత్రలు సినిమాకి అదనపు ఆకర్షణ.. అని చాలామంది ఆడియన్స్ అంటుంటే.. మరికొందరు నెల్సన్ దిలీప్ కుమార్ ఫస్ట్ హాఫ్ లా సెకండ్ హాఫ్ కూడా తీసుంటే సూపర్ స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేవారు అంటున్నారు. 

అదలా ఉంటే జైలర్ ఓటిటీ హక్కుల కోసం ఏర్పడిన భారీ డిమాండ్ లో జైలర్ డిజిటల్ హక్కులని జైలర్ నిర్మాతలైన సన్ పిక్చర్స్ వారు తమ సొంత ఓటిటీ సన్ నెక్స్ట్ కి విక్రయించారు. జైలర్ 30 నుండి 40 రోజుల లోపులో ఓటిటిలోకి వచ్చే ఛాన్స్ ఉంది.  

Jailer OTT Partner Revealed:

Rajinikanth Jailer OTT Partner Revealed

Tags:   RAJINIKANTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ