గుంటూరు కారం నుండి మహేష్ బాబు బర్త్ డే కి ఏదో రెండు పోస్టర్స్ వదిలారు. వాటికే మహేష్ అభిమానులు పండగ చేసుకున్నారు. గుంటూరు కారం నుండి ఫస్ట్ సింగిల్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి మహేష్ అభిమానులు డిస్పాయింట్ అయ్యారు. అయితే గుంటూరు కారం నుండి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తప్పుకున్నాడనే న్యూస్, అలాగే పూజ హెగ్డే తప్పుకుంది అనే న్యూస్ నడిచినా దానికి మేకర్స్ నుండి క్లారిటీ లేదు, అలాగే గుంటూరు కారం వచ్చే ఏడాది జనవరి 12న విడుదలయ్యే ఛాన్స్ కూడా లేదనే ప్రచారం జరిగింది.
ఆ ఊహాగానాలకి, ఆ ప్రచారానికి గుంటూరు కారం మేకర్స్ అడ్డుకట్ట వేశారు. సినిమా నుండి థమన్ తప్పుకోలేదు అంటూ నిన్న వచ్చిన పోస్టర్స్ లోనే ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అలాగే మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల, సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి అంటూ పోస్టర్స్ లొ ఫుల్ గా క్లారిటీ ఇచ్చారు. ఫైనల్ గా పూజ హెగ్డే తప్పుకుంది అని చెప్పకనే చెప్పేసారు.
అంతా బాగానే ఉంది గుంటూరు కారం సాంగ్ పై మేకర్స్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అంతేకాకుండా ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ అంటూ ప్రచారం షురూ అవ్వగా.. మహేష్ బర్త్ డే కి మించిన అకేషన్ ఏముంటుంది.. ఆగస్టు 15 కి ఇంకెన్ని రోజులుంది.. అదేదో మా హీరో బర్త్ డే రోజునే వదిలితే మేము హ్యాపీగా ఫీలయ్యేవాళ్ళం కదా అంటున్నారు.