సూపర్ స్టార్ రజినీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబో అనగానే.. నెల్సన్ తీసిన బీస్ట్ గుర్తుకు వచ్చి సూపర్ స్టార్ ఫాన్స్ వణికిపోయారు. స్టార్ హీరో విజయ్ కి బీస్ట్ తో అట్టర్ ప్లాప్ ఇచ్చిన నెల్సన్ తో రజిని ఎందుకు సినిమా చేస్తున్నారో అంటూ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నిరసన చేశారు. కానీ రజినీకాంత్ మాత్రం ఒప్పుకున్న ప్రాజెక్ట్ కోసం వెనుకడుగు వెయ్యకుండా జైలర్ ని పూర్తి చేసారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లాంటి స్టార్స్ భాగమవడంతో ఈప్రాజెక్టు మల్టీస్టారర్ లా మారడమే కాదు.. సినిమాపై అన్ని భాషా ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది.
నేడు ఆగష్టు 10న విడుదలైన జైలర్ ప్రీమియర్స్ ఓవర్సీస్ లో కంప్లీట్ అయ్యాయి. మరి జైలర్ ఓవర్సీస్ టాక్ ఎలా ఉందొ చూసేద్దాం.. సినిమా స్టార్ట్ అయ్యి రజనీకాంత్ పేరు తెరపైన పడగానే అభిమానుల కేరింతలు, అరుపులతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి.ఫస్టాఫ్‌లో యోగిబాబు, సూపర్ స్టార్ కాంబో సీన్స్ సూపర్‌గా ఉన్నాయని, ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్‌లో రజిని ఇరగదీశారంటూ.. ఫస్ట్ హాఫ్ డీసెంట్ అంటూ కొందరు నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.
జైలర్ ఫస్ట్ హాఫ్ డీసెంట్, ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ జైలు సీక్వెన్స్ గూస్ బంప్స్, సెకండాఫ్‌లో స్పెషల్ ఎంట్రీలతో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటూ మరొకరు ట్వీట్ చేసారు.
క్లైమాక్స్‌లో మేజర్ ట్విస్ట్ ఉంది. జైలర్ ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్స్ చేస్తుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. జైలర్ సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చుతుంది. రాబోయేది జైలర్ వీక్.. అంటూ మరికొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జైలర్ అదిరిపోయేలా ఉంది ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్. రజినీకాంత్ స్టయిల్ కి ఫిదానే, కొన్ని సన్నివేశాలు గూస్‌బంప్స్ తెపిస్తాయి. నెల్సన్ మంచి సినిమా ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.