కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే సౌత్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. తమిళనాతె కాదు.. తెలుగులోనూ ఆయనకి భీబత్సమైన అభిమానులు ఉన్నారు. సూపర్ స్టార్ సినిమా వస్తుంది అంటే ఇప్పటికీ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి. రజినీకాంత్ కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. గత కొన్నేళ్లుగా సక్సెస్ లకి దూరమైనా ఇప్పటికీ ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ప్రేక్షకులు అలెర్ట్ అవుతారు. ఆయన స్టయిల్ అలాంటిది మరి.
అయితే తెలుగులో ఇంత పెద్ద మార్కెట్ ఉన్న రజినీకాంత్ తెలుగుని అస్సలు పట్టించుకోకపోవడమే తెలుగు ప్రేక్షకులకి నచ్చడం లేదు. ఆయన నటించిన జైలర్ మూవీ నేడు తమిళంతో పాటుగా పలు భాషల్లో ప్యాన్ ఇండియా ఫిలింగా విడుదలవుతుంది. చెన్నై లో జైలర్ ఆడియో లాంచ్ పూర్తి చేసిన రజినీకాంత్ మళ్ళీ హిమాలయాస్ కి వెళుతూ ఎయిర్ పోర్ట్ దగ్గర కనిపించారు.. తప్ప మరె ఇతర భాషలోనూ రజిని జైలర్ ని ప్రమోట్ చెయ్యలేదు.
రజినీకాంత్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఆసక్తే. మరి రజినీకాంత్ హైదరాబాద్ వచ్చి జైలర్ కోసం ప్రమోషన్స్ లో పాల్గొంటే.. ఈ చిత్రానికి కలెక్షన్స్ బావుండేవి. రేపసలే మెగాస్టార్ నటించిన భోళా విడులవుతుంది. ఒకవేళ జైలర్ కి టాక్ తేడా కొడితే రెండోరోజే గప్ చుప్ అయ్యిపోవాలి. అదే సూపర్ స్టార్ తెలుగులోనూ సినిమాని ప్రమోట్ చేసి ఉంటే.. బుకింగ్స్ బావుండేవి అనేది ట్రేడ్ నిపుణుల అభిప్రాయం. మరి అది నిజమే. రజిని ఎందుకు టాలీవుడ్ ని అంతగా లైట్ తీసుకున్నారో కదా!