Advertisementt

భోళా శంకర్ పై రివెంజ్ తీర్చుకున్న జగన్

Wed 09th Aug 2023 10:02 PM
bhola shankar  భోళా శంకర్ పై రివెంజ్ తీర్చుకున్న జగన్
Jagan took revenge on Bhola Shankar భోళా శంకర్ పై రివెంజ్ తీర్చుకున్న జగన్
Advertisement
Ads by CJ

చిరు అనని మాటలు పట్టుకుని వైసీపీ నేతలు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. జగన్ ప్రభుత్వాన్ని చిరు ఏమి అనకుండానే సలహాలిస్తూ అవమానించారంటూ మంత్రులు, ఆ పార్టీ నేతలు ఎంతెలా నోరు పారేసుకున్నారో అందరికి తెలుసు. ఇదంతా జగన్ వెనకుండి నడిపించిన కథే. జగన్ డైరెక్ట్ గా మాట్లాడకుండా మంత్రులు, నేతలతో మాట్లాడించారు. సినిమా పరిశ్రమ తన కాళ్ళ కింద ఉండాలనుకునే జగన్ ఇప్పుడు తన ప్రభుత్వాన్ని అవమానించారనుకుని మెగాస్టార్ నటించిన భోళాశంకర్ పై రివెంజ్ తీర్చేసుకున్నాడు.  

భోళా శంకర్ టిక్కెట్ రేట్లు పెంచమని భోళా నిర్మాతలు జగన్ ప్రభుత్వానికి వినతి పత్రం అందించారు. కానీ భోళా నిర్మాతల విజ్ఞప్తిని ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. వారు సమర్పించిన వాటిలో అవి కరెక్ట్ గా లేదు, ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా లేవు అంటూ భోళా శంకర్ టికెట్స్ పెంపుకి జగన్ ప్రభుత్వం అంగీకరించలేదు. 

మరి ఇదంతా చూస్తుంటే జగన్ చిరంజీవి మీది డైరెక్ట్ గానే రివెంజ్ తీర్చుకున్నారనిపించేలా ఈమొత్తం వ్యవహారం ఉంది. మొన్నటివరకు చిరంజీవి మంచోడే.. కానీ జగన్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారనే అబద్దాన్ని నమ్మి జగన్ గారు ఇలా భోళా శంకర్ విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తున్నారంటూ మెగా అభిమానులు గింజుకుంటున్నారు. 

Jagan took revenge on Bhola Shankar:

Bhola Shankar ticket price hike rejected by AP govt

Tags:   BHOLA SHANKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ