మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసారు.. మా రెమ్యునరేషన్ గురించి కాదు.. ఏపీలో అభివృద్ధిపై దృష్టి పెట్టండి.. అక్కడ రోడ్లు వెయ్యండి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి.. ముందు ఆ పని చూడండి.. తర్వాత మా సినిమాలు, మా రెమ్యునరేషన్లు, కలెక్షన్స్ గురించి మాట్లాడుదురుగాని అంటూ వాల్తేర్ వీరయ్య 200 డేస్ ఫంక్షన్ లో కామెంట్స్ చేసినట్టుగా వచ్చిన వార్తలని పట్టుకుని ఏపీలోని వైసీపీ నేతలంతా ఒక్కొక్కరిగా దిగిపోయి.. మెగాస్టార్ ని సినిమా ఇండస్ట్రీని నోటికొచ్చిన తిట్లు తిడుతూ నోటికొచ్చిన బూతులతో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.
మెగాస్టార్ మాట్లాడిందేమిటి.. అసలు ఆయన అన్నదేమిటో కూడా పట్టించుకోకుండా.. చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారంటూ నాని ద్వయం, బొత్స, అంబటి, రోజా, అమర్నాధ్ రెడ్డిలు మీడియా సమావేశాలు నిర్వహించి కారు కూతలు కూస్తున్నారు. అయితే అసలు చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
వాల్తేరు వీరయ్య వేడుకలో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన అసలు మాటలు.
👉 సినిమా నటుల రెమ్యునరేషన్స్ గురించి ఢిల్లీ పెద్దలు రాజ్యసభలో మాట్లాడటం నాకు చాలా బాధ కలిగింది..
👉 మేము నటించేది సినిమా ఇండస్ట్రీలో కార్మికులు ఆనందంగా జీవించడం కోసం.. ఎన్ని ఎక్కువ సినిమాలు చేస్తే అన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయనేది మా ఉద్దేశం..
👉 నేను దేశ రాజకీయాలు చూశా, వాటి ముందు సినిమా రంగం చాలా చిన్నది..
👉 మా నటన నచ్చితే అభినందించండి, కానీ రాజకీయాలతో ముడిపెట్టి చూడకండి..
👉 అలా కాకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి.
- మెగాస్టార్ చిరంజీవి
ఇది ఆయన మాట్లాడింది. ఇక్కడ ఏపీ ప్రభత్వ ప్రస్తావన కానీ, ఏపీలో అభివృద్ధి గురించి మాట్లాడింది కానీ లేదు.. మరి మెగాస్టార్ వ్యాఖ్యలని వక్రీకరించి వారి భాషలోకి డీ కోడ్ చేసుకుని వైసీపీ నేతలు అంతగా గించుకోవాల్సిన అవసరం ఏమిటో వారికే తెలియాలి.