Advertisementt

వైరల్: పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్

Wed 09th Aug 2023 06:53 PM
vijay devarakonda  వైరల్: పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్
Viral: Vijay Devarakonda comments on marriage వైరల్: పెళ్లిపై విజయ్ దేవరకొండ కామెంట్స్
Advertisement
Ads by CJ

కొద్దిరోజులుగా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారు, వీరు అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కే ఛాన్స్ వుంది, కాబట్టే ఇరు ఫామిలీస్ ఈమధ్యనే లంచ్ అంటూ రెస్టారెంట్ లో స్పెండ్ చేసారంటూ ఎన్నో వార్తలు, ఎన్నెన్నో గాసిప్స్ సోషల్ మీడియాలో కనిపించాయి. కానీ విజయ్ దేవరకొండ-రష్మిక లు ఇద్దరూ కూడా తమ మధ్యన ఏమి లేదు.. మేము కేవలం ఫ్రెండ్స్ అంటూ ఎప్పటికప్పుడు తమ డేటింగ్ రూమర్స్ ని ఖండిస్తూనే ఉన్నారు. 

తాజాగా విజయ్ దేవరకొండ ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పెళ్లిపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాను కొంతకాలంగా భాగస్వాములను వెతుకుతున్నాను, ప్రస్తుతం నేను పెళ్లికి సిద్ధంగా లేను. ఇప్పుడు ఉండొచ్చు, లేదంటే రెండేళ్లలో నా పెళ్లి ఉండవచ్చునని నేను అనుకుంటున్నాను. ఎలా జరుగుతుందో చూద్దాం అంటూ విజయ్ దేవరకొండ పెళ్లిపై చేసిన ఆసక్తికర కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

విజయ్ ప్రస్తుతం ఖుషి రిలీజ్ ప్రమోషన్స్ తో పాటుగా.. గౌతమ్ తిన్ననూరి అలాగే పరశురామ్ మూవీస్ తో బిజీగా గడుపుతున్నాడు. గౌతమ్ తిన్ననూరి మూవీలో శ్రీలీలతో రొమాన్స్ చేస్తున్న విజయ్ పరశురామ్ మూవీలో మృణాల్ ఠాకూర్ తో జోడి కడుతున్నాడు. 

Viral: Vijay Devarakonda comments on marriage:

 Vijay Devarakonda interesting comments on marriage

Tags:   VIJAY DEVARAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ