ఖుషి షూటింగ్ కంప్లీట్ చేసేసి.. సమంత బాలికి వెకేషన్స్ కి వెళ్ళిపోయింది. అక్కడొక పది రోజుల పాటు తన స్నేహితురాలితో కలిసి ఎంజాయ్ చేసింది. మార్నింగ్ వాక్, డిఫరెంట్ వర్కౌట్స్, అలాగే నేచర్ ని ఎంజాయ్ చేస్తూ సెల్ఫీలతో సోషల్ మీడియాలో హడావిడి చేసిన సమంత ఇక్కడ ఖుషి ప్రమోషన్స్ లో మాత్రం మిస్సయ్యింది. ఈరోజు బుధవారం విజయ్ దేవరకొండ-సమంత కాంబోలో శివ నిర్వాణ తెరకెక్కించిన ఖుషి మూవీ ట్రైలర్ లాంచ్ జరిగింది.
ప్యాన్ ఇండియా మూవీ గా సెప్టెంబర్ 1న విడుదల కాబోతున్న ఖుషి మూవీ ట్రైలర్ లాంచ్ హైదరాబాద్ లోని పార్క్ హయ్యత్ లో పలు ఇండస్ట్రీల జర్నలిస్ట్ ల మధ్యలో గ్రాండ్ గా జరిగింది. ప్యాన్ ఇండియా మూవీ ప్రమోషన్స్ అంటే ఓ రేంజ్ లో ఉండాలి. కానీ ఖుషి ట్రైలర్ లాంచ్ జస్ట్ అలా అలా జరిగిపోయింది. ఈవెంట్ లో మూవీ టీం అంటే డైరెక్టర్, నిర్మాతలు, హీరో ఉన్నారు కానీ అసలైన హీరోయిన్ సమంత లేదు.
మరి బాలి వెకేషన్స్ తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చిన సమంత ఖుషి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొనలేదు. ఆ లోటు ఖుషి ఈవెంట్ గ్రూప్ పిక్ లో తెలుస్తుంది. మరి జాలి గానే కనిపిస్తున్న సమంత ఈ ట్రైలర్ లాంచ్ వేడుకకి ఎందుకు రాలేదో.. ఈ విషయమై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.