Advertisementt

మెగాస్టార్ పై రోజా ఫైర్

Wed 09th Aug 2023 04:25 PM
chiranjeevi  మెగాస్టార్ పై రోజా ఫైర్
Roja Fire on Megastar మెగాస్టార్ పై రోజా ఫైర్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవిపై మినిస్టర్ రోజా ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వ పనితీరుపై చిరంజీకి వ్యాఖ్యలకి కాస్త ఆలస్యంగా స్పందించిన రోజా.. ఏపీలో అభివృద్ధి జరుగుతుందో లేదో, రోడ్లు వేసామో లేదో ఇంటింటికి, గడపగడపకు వచ్చి చూస్తే తెలుస్తుంది. హీరోలతో కలిసి టికెట్లు రేట్లు పెంచమని ఏ అర్హత ఉందని చిరంజీవి  జగన్ గారి దగ్గరకి వచ్చారు.. ఏ హీరో కూడా జగన్ ప్రభుత్వంపై కామెంట్స్ చెయ్యలేదు, విమర్శించలేదు. 

అసలు అభివృద్ధి అంటున్న చిరంజీవి గారు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసారు, రాష్ట్రానికి ఏం వెలగబెట్టారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేదు. కేంద్రమంతిగా రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఎందుకు తేలేకపోయారు. చిరంజీవి చెబితే వినే పరిస్థితిలో జగన్ గారు లేరు.. ఇంకోసారి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు అంటూ రోజా మెగాస్టార్ చిరంజీవిపై చిందులు తొక్కారు. 

మరి మినిస్టర్ అయ్యాక మెగాస్టార్ ఇంటికెళ్లి బొకే ఇచ్చి మరీ ఆతిధ్యం అందుకున్న రోజా ఇప్పుడు మెగాస్టార్ పై ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం విడ్డురం.. ఎమ్మా రోజా పాత రోజులు మర్చిపోయావా అంటూ మెగా ఫాన్స్ రోజాపై ఆగ్రాహం వ్యక్తం చేస్తున్నారు. 

Roja Fire on Megastar:

Minister Roja Fire on Megastar Chiranjeevi

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ