యుంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకప్పుడు బొద్దుగా బరువుగా కనిపించేవారు. కానీ యమదొంగ సమయం నుండి ఆయన బాడీని స్లిమ్ గా మెయింటింగ్ చేస్తున్నారు. జిమ్ ట్రైనర్లు ఆధ్వర్యంలో రకరకాల వర్కౌట్స్ తో బాడీని మెయింటింగ్ చేస్తున్నారు. అరవింద సమెత టైమ్ లో సిక్స్ ప్యాక్ చేసారు. ఆ తర్వాత ఎన్టీఆర్ లుక్స్ లో కొద్దిగా మార్పు కనిపించింది. ఆయన పర్ఫెక్ట్ గా జిమ్ చెయ్యకపోతే ఇట్టే లావైపోతారు. ఎందుకంటే ఎన్టీఆర్ భోజన ప్రియుడు కాబట్టి.
అప్పుడప్పుడు ఆయన లుక్స్ విషయంలో ఫాన్స్ కంగారు పడేవారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవర కోసం కొత్త లుక్ లోకి స్లిమ్ గా మారిపోయారు. వర్కౌట్స్ కోసమే ఎన్టీఆర్ అప్పుడప్పుడు విదేశలకు కూడా వెళుతూ ఉంటారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో తలమునకలై ఉన్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ డ్రెస్సింగ్ స్టయిల్ కి, ఆయన కొత్త లుక్ కి ఫాన్స్ బాగా ఎగ్జైట్ అయ్యారు.
తాజాగా ఎన్టీఆర్ సెల్ఫీ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఎన్టీఆర్ నిన్న మంగళవారం ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన కొత్త లుక్ ని ఎన్టీఆర్ ఆలిం హాకిమ్ షేర్ చేసారు. ఎన్టీఆర్ ఈ పిక్ లో కొత్తగా, బ్లాక్ డ్రెస్ లో, కొత్త హెయిర్ స్టయిల్ తో హ్యాండ్ సమ్ గా కనిపించారు. ఎన్టీఆర్ న్యూ లుక్ చూసి ఆయన ఫాన్స్ పండగ చేసుకున్నారు.