యంగ్ టైగర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడవడమే కాదు.. సోషల్ మీడియాలోనూ దేవర అప్ డేట్స్ అదిరిపోతున్నాయి. అయితే గత వారం రోజులుగా ఎన్టీఆర్ సముద్రంలో షార్క్ తో ఫైట్ చేస్తాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఆర్.ఆర్.ఆర్ లో పులితో ఫైట్ చేసిన ఎన్టీఆర్ దేవరలో షార్క్ తో ఫైట్ చెయ్యబోతున్నాడు.. ఇక భీభత్సమే అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ కూడా తెగ ఎగ్జైట్ అవుతున్నారు.
తాజాగా దేవర సోషల్ మీడియా హ్యాండిల్ నుండి మేకర్స్ ఎన్టీఆర్ షార్క్ తో ఫైట్ సీక్వెన్స్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చేసారు. Action sequence between #NTR and Shark in #Devara🔥 అని వచ్చిన ఓ న్యూస్ ని రీ ట్వీట్ చేస్తూ.. Fake news 👍 అని దేవర సోషల్ మీడియా టీం బదులిచ్చింది. సో ఎన్టీఆర్ షార్క్ తో ఫైట్ చెయ్యడం జస్ట్ రూమర్ అని తేలిపోయింది.