Advertisementt

చిరంజీవి అయితే మాకేంటి!

Wed 09th Aug 2023 08:58 AM
chiranjeevi  చిరంజీవి అయితే మాకేంటి!
What about Chiranjeevi? చిరంజీవి అయితే మాకేంటి!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు నిమ్మలించేలా కనిపించడం లేదు. ఏపీ ప్రభుత్వం మంత్రులు, నేతలు మొత్తంగా మెగాస్టార్ చిరంజీవిపై, ఇండస్ట్రీపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. పకోడిగాళ్లంటూ నానా మాటలంటున్నారు. అటు మెగా ఫాన్స్ కూడా మెగాస్టార్ చిరుని అంటే ఊరుకోము.. అంటూ ఏపీ మంత్రులకి వార్నింగ్ ఇస్తున్నారు. మరోపక్క వైసీపీ అభిమానులు కూడా మెగాస్టార్ పై విరుచుకుపడుతున్నారు. 

చిరంజీవి @KChiruTweets గారు మళ్ళీ మీకెందుకు అండి రాజకీయాలు... మా బాస్ జోలికి వస్తే భోళా శంకర్ అయినా, గుడుంబా శంకర్ అయినా ఒకటే.., బాక్సులు బద్దలాయ్ పోతాయ్.!! అభిమాన నటుడైనంత మాత్రాన మేము ఆరాధించే నాయకుడ్ని అంటే ఉరుకుంటామా...?! కాస్త నిమ్మళించండి.!! అంటూ వైసిపి నేతలు, అభిమానులు.. భోళా శంకర్ ని అడ్డుకుంటామని విధంగా ట్వీట్స్ చేస్తున్నారు. 

చిరంజీవి రాజకీయాల్లో లేకపోతే మాట్లాడకూడదా.. వైసీపీ నేతలైతే సినిమా వాళ్ళ మీద కామెంట్స్ చెయ్యొచ్చా.. సినిమాలకి సంబంధం లేని వారు కూడా సినిమాల గురించి మాట్లాడతారా అంటూ మెగా ఫాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. 

What about Chiranjeevi?:

YCP warning to Megastar Chiranjeevi

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ