Advertisementt

భోళాని ఆపే దమ్ముందా?

Tue 08th Aug 2023 09:16 PM
chianjeevi  భోళాని ఆపే దమ్ముందా?
BoyCottBholaaShankar hashtag trends on twitter భోళాని ఆపే దమ్ముందా?
Advertisement
Ads by CJ

వాల్తేర్ వీరయ్య 200 డేస్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఏపీ మంత్రులు, నేతలు పొలోమంటూ చిరుపై, ఇండస్ట్రీ పై పడిపోతున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వైసీపీ నేతలంతా మెగాస్టార్ చిరంజీవిని తెగ విమర్శించేస్తున్నారు. మరోపక్క వైసీపీ కార్యకర్తలు మెగాస్టార్ చిరంజీవి సినిమాలని ఏపీలో ఆడనివ్వమంటూ #BoyCottBholaaShankar హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. 

ఇంకొంతమంది #Boycott మెగా ఫ్యామిలీ హీరోస్ మూవీస్ అంటూ హడావిడి మొదలు పెట్టారు. రేపు శుక్రవారం విడుదల కాబోయే భోళా శంకర్ మూవీని బాయ్ కాట్ చేస్తామంటూ రెచ్చిపోయి సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు. మరోపక్క వైసీపీ నేతలకి మెగా ఫాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. మా హీరో జోలికి వస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. 

ఒకవేళ భోళా శంకర్ ని బాయ్ కాట్ చేసి చూడండి తీవ్ర పరిణామాలుంటాయంటూ మాస్ గా వైసీపీ నేతలకి, కార్యకర్తలకి వార్నింగ్ చేస్తున్నారు. ఇండస్ట్రీ మంచి కోసమే జగన్ ముందు నిలబడ్డారు మెగాస్టార్. కానీ మీరు మెగా హీరోలని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఎందుకూరుకోవాలి అంటూ మెగా ఫాన్స్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. భోళా ని బాయ్ కాట్ చేసి చూడండి మీ అంతు తెలుస్తామంటూ మెగా అభిమానూలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

BoyCottBholaaShankar hashtag trends on twitter :

BoycottMegaHeroes hashtag trends on twitter 

Tags:   CHIANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ