షార్ట్ ఫిలిం కి ఎక్కువ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కి తక్కువ. అనే కంటెంట్ పట్టుకుని బ్రో సినిమా తయారైంది. కేవలం పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ తో ఆశించినంత కాకపోయినా, అందినంత కలెక్షన్స్ రాబట్టుకుంది. బ్రో రిలీజ్ ని ఏ మాత్రం పట్టించుకోకుండా తన పార్టీ కార్యకలాపాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ మునిగిపోతే ప్రొడ్యూసర్ టిజి విశ్వప్రసాద్ మాత్రం ప్రతి ప్రశ్నకి సమాధానమిస్తూ సాయి ధరమ్ తేజ్ ని వెంటేసుకుని విజయయాత్రలంటూ తిరుగుతున్నారు. అదెంతటి విజయమన్నది ఆ మేకర్స్ కి తెలుసు. ఆ బాక్సాఫీసు లెక్కలు ట్రేడ్ సర్కిల్స్ కి తెలుసు.
రెండో వీకెండ్ తో బ్రో థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యిపోయింది అనేది అందరికి తెలిసిన వాస్తవం. అందుతున్న కలెక్షన్స్ నిరూపిస్తున్న సత్యం. ఇంకా ఎందుకు పట్టుబట్టారో ఎందుకంత పట్టుదల చూపిస్తున్నారో కానీ.. కొన్ని థియేటర్స్ నుంచి మాత్రం బ్రో ని తియ్యడానికి నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఒప్పుకోవడం లేదు. ఈ ఎఫెక్ట్ ఇంకెవరిమీదైనా పడుతుందా అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ బిగ్ బ్రో చిరంజీవి మీదే పడుతుంది. ఆగస్టు 11 న రిలీజ్ కి సిద్దమైన భోళా శంకర్ సినిమాకి చాలా కేంద్రాల్లో, పలు ప్రాంతాల్లో అడ్డంకిగా మారింది బ్రో. వైజాగ్ లాంటి ఏరియాలోనే చిరంజీవికి సరైన థియేటర్ దొరకట్లేదు అంటే ఆ ఆటంకం అన్నయ్యకి తమ్మడు సృష్టించిందే.
ఓ వైపు దిల్ రాజు హవా, మరోవైపు మైత్రి మేకర్స్ వేగం, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆగం తట్టుకుని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర భోళా శంకర్ ని సరిగ్గా రిలీజ్ చేసుకోగలుగుతారా, ఏజెంట్ తో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చెయ్యలేని ఎదురు దెబ్బ తిన్న ఆ నిర్మాత ఈ సినిమాతో అయినా కోలుకుంటారా.. మరో మూడు రోజుల్లో తేలిపోతుంది.