ఏపీ టూరిజం మినిస్టర్ రోజాపై రోజు రోజుకి ట్రోలింగ్ పెరిగిపోతూనే ఉంది. సెటైర్స్ ప్రవాహం కొనసాగుతుంది. కేవలం ప్రతి పక్షాన్ని విమర్శించడానికి మాత్రమే ప్రెస్ మీట్స్ పెట్టి హడావిడి చేసే రోజా.. ఇతర సమయాల్లో మాత్రం పార్టీలు చేసుకుంటూ జల్సాగా, ఖుషీగా గడుపుతున్నారని విమర్శిస్తున్నారు నెటిజెన్లు. నిన్నటికి నిన్న వాల్తేర్ వీరయ్య పాటలకి ఓ రేంజ్ లో రెచ్చిపోయి స్టెప్పులేశారు మంత్రిగారు. ఆ వీడియో క్లిప్ కాస్తా సోషల్ మీడియాలో వీర విహారం చెయ్యడం మొదలు పెట్టింది.
రోజా విషయంలో ఇలా వీడియోస్ బయటికి రావడం ఇదే మొదటిసారి కాదు బేసిక్ గా సినిమా హీరోయిన్ అయిన రోజా కొన్ని మీటింగ్స్ కి అటెండ్ అయినప్పుడు తాను మంత్రిని అనే సంగతి మర్చిపోయి నృత్యప్రావిణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ వీడియో అలా బయటికి రాగానే ఇలా ట్రెండ్ చేసి పడేస్తుంటారు సోషల్ మీడియాలో. అయినా కూడా అప్రమత్తంగా ఉండని రోజా తనపై ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా కాలు కదపడం ఆపరు. స్టెప్స్ వెయ్యడం మానరు. అన్నిటిని మించిన విశేషం ఏమిటంటే.. టైమ్ కుదిరితే, మైక్ దొరికితే ఎవరినైతే విమర్శించేస్తూ ఉంటారో.. ఎవరి మీదనైతే విరుచుకుపడిపోతూ ఉంటారో ఆ హీరోల పాటలకే మంత్రి గారు పార్టీలో నర్తిస్తూ ఉంటారు.
ఈ విమర్శలు రోజా డాన్స్ ల వరకే పరిమితం కాలేదు. ఎన్ని విల్లాలు కొన్నారు, అన్ని కార్లున్నాయి ఆ రేంజ్ లో కమీషన్లు తీసుకుంటున్నారు అంటూ లెక్కలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి. వీటిపట్ల స్పందించే ధైర్యం లేదా సమయం రోజాకి కుదరట్లేదేమో కానీ.. జనం మాత్రం వీటిని గట్టిగానే సర్క్యులేట్ చేస్తున్నారు. రేపటి ఎన్నికల రిజల్ట్ ని రోజాకి రుచి చూపించబోతున్నారు.