యువ గళం అని పాదం కదిపిన నారా లోకేష్ యాత్రలో రోజు రోజుకి దూసుకుపోతున్నాడు. మాటల వాడి పెంచుతున్నాడు. కార్యకర్తల్లో వేడి పుట్టిస్తున్నాడు. రోజు రోజుకి యాత్ర తాలూకు బలం బయటపడుతుంది. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. అన్నిటిని మించి పప్పు పప్పు అని ఎద్దేవా చేసినవాళ్లందరి తుప్పు వదిలిపోయేలా తన గళం గట్టిగా వినిపిస్తున్నాడు నారా లోకేష్. ఈ రోజు తాను పెట్టిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
ఇంతకీ నారా లోకేష్ చేసిన ట్వీట్ ఏమిటంటే..
ఈ రోజు బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారి జయంతి, అబ్బాయిలు మరిచిపోయినట్టున్నారు. వీరికి బాబాయ్ జయంతి గుర్తుండదు కానీ వర్థంతి మాత్రం డేట్, టైముతో సహా గుర్తుంటుందని సీబీఐ నిర్ధారించింది. వేటు వేసిన చేతులతోనే బాబాయ్ జయంతికి ట్వీటు వేస్తే బాగోదనేమో వేయలేదు. అబ్బాయిల వేధింపులు-కుతంత్రాలకి ఎదురొడ్డి సోదరి సునీత గారు చేస్తున్న న్యాయపోరాటంలో తప్పక గెలుస్తారు. తన తండ్రిని చంపిన కన్నింగ్ కజిన్స్‌తో జైలు ఊచలు లెక్కపెట్టించే వరకూ విశ్రమించరు. వివేకానందరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.. అంటూ లోకేష్ ట్వీట్ చేసాడు.
సో... అదండీ మ్యాటర్. నారా లోకేష్ ట్వీట్ పట్ల ఒకవైపు వైసీపీ శ్రేణులు గింజుకుంటుంటే, మరోవైపు టీడీపీ వర్గాలు ఉవ్వెత్తుతున్న ఉత్సాహంతో ఆ ట్వీట్ ని వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మాటల యుద్ధం మరింత పెరిగేలా కనిపిస్తుంది. అధికార పక్షంపై విపక్షాలు ఇంకాస్త విరుచుకుపడిపోతారనే సంకేతాలు అందుతున్నాయి. చూద్దాం ముందు ముందు మరెన్ని వ్యంగ్యాస్త్రాలు చూస్తామో.. ఇంకెన్ని మాటల పోటులు వేటులు వింటామో..