పుష్ప ద రైజ్ లోనే విలన్ గా ఫహద్ ఫాసిల్ ని రివీల్ చేసారు సుకుమార్. పుష్ప పార్ట్ 1 లో చివరి వరకు అంటే ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు ఫహద్ ఎంట్రీ లేదు. సినిమా చివరిలో ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ గా పోలీస్ అధికారిగా ఎంట్రీ ఇచ్చి పుష్ప రాజ్ తో వైరం పెట్టుకుని.. క్లైమాక్స్ లో అల్లు అర్జున్ vs ఫహద్ ఫాసిల్ మధ్యన యుద్ధం ఎలా స్టార్ట్ అయ్యిందో చెప్పి సుకుమార్ ఎండ్ కార్డు వేశారు.
పోలీస్ ఆఫీసర్ ఫహద్ కి పుష్ప రాజ్ కి మధ్యన సెకండ్ పార్ట్ లో భీకర సన్నివేశాలు ఉంటాయని సుకుమార్ పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. అయితే అల్లు అర్జున్ బర్త్ డే రోజున వదిలిన పుష్ప 2 స్పషల్ వీడియోలో ఎక్కడా ఫహద్ లుక్ చూపియ్యలేదు. అంటే ఫహద్ ఫాసిల్ స్పెషల్ లుక్ ఏముంటుంది.. ఆయన పోలీస్ డ్రెస్ లోనే కనిపిస్తారని అనుకున్నారు. కానీ నేడు ఆగష్టు 8 న ఫహద్ ఫాసిల్ బర్త్ డే సందర్భంగా ఫహద్ ఫాసిల్ లుక్ ని పుష్ప2 టీమ్ వదిలింది.
అందులో ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ గా సిగార్ తాగుతూ కొత్తగా కనిపించారు. గుండులోనే ఉన్నా.. అందులో ఆయన మాస్ లుక్స్ రివీల్ అయ్యాయి. చాలా కోపంగా ఫహద్ ఫాసిల్ సిగరెట్ తాగుతున్న లుక్ అది. పుష్ప 2 మేకర్స్ సైలెంట్ గా ఫహద్ బర్త్ డేకి ఫాన్స్ కి కావాల్సిన ట్రీట్ అందించేసారు.